Advertisement

  • హిందీ భాష రాదా ..మీరు అసలు భారతీయులేన ..డీఎంకే నాయకురాలు కనిమొళికి చేదు అనుభవం

హిందీ భాష రాదా ..మీరు అసలు భారతీయులేన ..డీఎంకే నాయకురాలు కనిమొళికి చేదు అనుభవం

By: Sankar Mon, 10 Aug 2020 08:16 AM

హిందీ భాష రాదా ..మీరు అసలు భారతీయులేన ..డీఎంకే నాయకురాలు కనిమొళికి చేదు అనుభవం



భారతీయులకు విదేశీ ఎయిర్ పోర్ట్ లలో అనేక సార్లు అవమానాలు జరిగిన విషయాలు తెలిసిందే ..అబ్దుల్ కలాం , షారుక్ ఖాన్ వంటి వారికి కూడా జరిగాయి ..అయితే తాజాగా డీఎంకే నాయకురాలు కనిమొళికి ఇండియాలోని కేరళలో ఇలాంటి చేదు సంఘటన ఎదురు అయింది .ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన కేరళలోని కోళీకోడ్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన డీఎంకే నేత, లోక్‌సభ సభ్యురాలు కనిమొళి దయానిధికి చేదు అనుభవం ఎదురైంది.

ఘటనాస్థలంలో విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ మహిళా జవాను ‘మీరు భారతీయులేనా?’అని ప్రశ్నించి కనిమొళిని అవమానించారు. ఈ విషయాన్ని కనిమొళి ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘ విమానం ప్రమాదం జరిగిన కోజికోడ్ ఎయిర్‌పోర్టుకు ఈ రోజు ఉదయం వెళ్లాను.

అయితే, అక్కడున్న ఓ సీఐఎస్‌ఎఫ్‌ మహిళా జవాను హిందీలో నాతో ఏదో చెబుతోంది. నాకు హిందీ రాదని, దయచేసి తమిళం లేదంటే ఇంగ్లిష్‌లో మాట్లాడమని సూచించాను. దానికి ఆ జవాను స్పందన చూసి మతి పోయింది. హిందీ తెలియదా? ఇంతకూ మీరు భారతీయులేనా? అని ఆమె నన్ను ప్రశ్నించింది.

అంటే హిందీ భాష వచ్చినవారు భారతీయులు అన్నట్టేనా!’అని ఎంపీ కనిమొళి ట్విటర్‌లో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర సర్కారు బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కనిమొళికి కలిగిన అసౌకర్యంపై సీఐఎస్‌ఎఫ్‌ స్పందించింది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యురాలిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఏ ఒక్క భాషపై తమకు పక్షపాతం లేదని స్పష్టం చేసింది.

Tags :
|
|
|

Advertisement