Advertisement

  • శ్వేతా రెడ్డి ఘటనపై విచారణకు ఆదేశించిన డీఎంహెచ్ఓ

శ్వేతా రెడ్డి ఘటనపై విచారణకు ఆదేశించిన డీఎంహెచ్ఓ

By: Sankar Wed, 09 Sept 2020 12:22 PM

శ్వేతా రెడ్డి ఘటనపై విచారణకు ఆదేశించిన డీఎంహెచ్ఓ


కార్పొరేట్ ఆసుపత్రిలో డబ్బుల దాహానికి ఇటీవల బలి అయిన గ్రూప్ 2 అధికారి శ్వేతా రెడ్డి..గర్భిణి అయిన శ్వేతారెడ్డిని కాన్పుకోసం ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. డెలివరీ తర్వాత ఆమెకు కరోనా సోకిందని రూ. 29 లక్షల వరకు ఫీజు వసూలు చేశారు. ఆ తర్వాత ఆమె మరణించిందంటూ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. తాజాగా ఈ ఘటనపై స్పందించిన డీఎంహెచ్ విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

శ్వేత గర్భిణి కావడంతో జూలై 27న స్వల్పంగా జ్వరం వచ్చింది. దీంతో ఆమెను మహబూబ్ నగర్‌లో ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఇంటికి పంపారు. అయితే జ్వరం తగ్గకపోవడంతో కోస్గిలోని మరో ఆస్పత్రిలో చూపించారు. దీంతో దగ్గు వస్తుండటంతో కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. స్థానిక జనరల్ ఆస్పత్రిలో కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది.

అయితే జిల్లాలో ఉన్న స్థానిక ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడంతో గతనెల 4న హైదరాబాద్‌లో ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. రెండు లక్షలు కడితేనే సిజేరియన్ చేస్తామని చెప్పడంతో డబ్బు చెల్లించారు. శ్వేతారెడ్డి మగబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత శ్వేతారెడ్డికి ఆయాసం రావడంతో మరోసారి కరోనా పరీక్షలు చేశారు. రిపోర్ట్ చూపించకుండానే పాజిటివ్ అని అక్కడ సిబ్బంది చెప్పారని భర్త ఆరోపిస్తున్నారు. 20 రోజుల పాటు ఐసీయూలో ఉంచి 29 లక్షలు ఫీజు కట్టించుకున్నారని భర్త మాధవ రెడ్డి ఆరోపిస్తున్నారు. తన భార్య తర్వాత చనిపోయిందంటూ తనకు మృతదేహాన్ని అప్పగించాని ఆవేదన చేశాడు..


Tags :
|

Advertisement