Advertisement

  • ఇంత బాధ్యతారాహిత్యమా ...జొకోవిచ్ పై విమర్శల వెల్లువ ...

ఇంత బాధ్యతారాహిత్యమా ...జొకోవిచ్ పై విమర్శల వెల్లువ ...

By: Sankar Wed, 24 June 2020 09:52 AM

ఇంత బాధ్యతారాహిత్యమా ...జొకోవిచ్ పై విమర్శల వెల్లువ ...



అతడొక ప్రపంచ దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు ..అతడు ఆడుతుంటే చూడటానికి అభిమానులు ఎన్ని ఇబ్బందులు ఉన్న చూడటానికి స్టేడియాలు తరలి వస్తారు ..కేవలం తన ఆటతీరుతోనే కాక మైదానంలో తాను చేసే చేష్టలతో కూడా అభిమానులను ఎన్నో సార్లు అలరించాడు ..కానీ ఇప్పుడు అతడు చేసిన తప్పిదమే టెన్నిస్ క్రీడాకారుల పట్ల కరోనా పాశం అయింది ..అతడే సెర్బియా దిగ్గజ ఆటగాడు నోవాక్ జొకోవిచ్ ..అతడు నిర్వహించిన ఒక ఎక్సిబిషన్ టోర్నీ వలన ఇపుడు కరోనా టెన్నిస్ ప్రపంచానికి పాకింది ..అతడు ఆ టోర్నీ నిర్వహించింది మంచి పనికోసమే అయినా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడంతో ప్రపంచం నలుమూలల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ..ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే అతడు మరియు అతడి భార్య కూడా ఈ కరోనా బారిన పడ్డారు ..

సెర్బియాలో గత ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో.. ఆడ్రియా టూర్ ఎగ్జిబిషన్‌ ఛారిటీ టోర్నీని జకోవిచ్ నిర్వహించాడు. ఈ టోర్నీలో ఆడేందుకు స్టార్ క్రీడాకారుల్ని ఆహ్వానించిన జకోవిచ్.. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. టోర్నీలో ఆటగాళ్ల మధ్య కౌగలింతలు, షేక్‌హ్యాండ్స్ షరా మామూలే. ఇక స్టేడియంలోకి వచ్చిన అభిమానుల్లో కొంత మంది మాస్క్‌లు ధరించలేదు.. అలానే సామాజిక దూరం కూడా పాటించలేదు. దాంతో.. ఇప్పుడు ఎంత మంది కరోనా వైరస్ బారినపడ్డారో..? అని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇందులో ఇంకా ఎక్కువ ఆందోళన పరిచే అంశం ఏంటి అంటే ఈ ఆటగాళ్లు అందరూ మ్యాచ్లు ముగిసిన తర్వాత బాల్ బాయ్స్ మరియు గర్ల్స్ తో ఫోటోలు దిగారు అంతేకాకుండా స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతో కూడా ఫోటోలు దిగారు దీనితో ఎంతమందికి ఈ వైరస్ సోకిందో అని అందరూ ఆందోళన చెందుతున్నారు ..తనకి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో జకోవిచ్ స్పందించాడు ‘‘సెర్బియాలో వైరస్ ఉనికిని తక్కువ అంచనా వేశాను. ఇప్పుడు నాతో పాటు నా భార్యకి కూడా కరోనా సోకింది. అయితే.. నా పిల్లలకి మాత్రం నెగటివ్‌గా తేలింది. టోర్నీ కారణంగా వైరస్ బారినపడిన వారిని క్షమాపణలు కోరుతున్నా’’ అని వెల్లడించాడు.


Tags :
|

Advertisement