Advertisement

దివ్వెల పండుగ దీపావళి...

By: chandrasekar Sat, 14 Nov 2020 06:14 AM

దివ్వెల పండుగ దీపావళి...


ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వచ్చే దివ్వెల పండుగ దీపావళి. పండుగ రోజున ఇంటిని శుభ్రం చేసి, రకరకాల పండి వంటలు తయారుచేస్తారు. సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి, వెలిగించి, గుమ్మాల్లో నేల మీద కొడుతూ... ‘‘దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి, పుట్ట మీద జొన్నకర్ర, పుటుక్కు దెబ్బ’’ అని పాడతారు. అనంతరం గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోటవేసి, వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారనే విశ్వాసం ఉంది.

diwali,is the festival,of lights,lamp,sweets ,దివ్వెల,పండుగ, దీపావళి ,ఆరోగ్యంగా, ఎదుగుతారనే విశ్వాసం


చిమ్మ చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే ఈ పండుగ జీవితంలోనూ కొత్త వెలుగులు నింపుతుందని విశ్వసిస్తారు. దీపావళి వస్తుందంటే చాలు, దేశమంతా సందడి నెలకొంటుంది. మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుని సంతోషాన్ని పంచుకుంటారు. మరి, ఈ పండుగ సంతోషాన్ని మీ కుటుంబికులతోనే కాకుండా సుదూర ప్రాంతాల్లోని ఆప్తులు, మిత్రులతోనూ పంచుకోవాలని అనుకుంటున్నారా? వెంటనే ఈ విషెస్‌ను మీ ఆప్తులతో షేర్ చేసుకోండి.చెడుపై మంచి సాధించిన విజయకేతనం..

అవనికంతా ఆనంద విజయోత్సాహం..అజ్ఞానపు చీకట్లు తొలగించే..విజ్ఞాన దీపాల తేజోత్సవం..

Tags :
|
|

Advertisement