Advertisement

కనులకు ఇంపైన దీపావళి పండుగ.💥💥💥

By: chandrasekar Sat, 14 Nov 2020 06:14 AM

కనులకు ఇంపైన దీపావళి పండుగ.💥💥💥


దీపావళి...జీవితాల్లో వెలుగులు నింపే ఈ దివ్వెల పండగ మళ్లీ వచ్చేసింది.... భారతీయులకు ఎంతో ముఖ్యమైన పండగ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు..అందరూ సుఖసంతోషాలతో జరుపుకునే పర్వదినం. ప్రతి ఏటా దీపావళి తేదీ మారుతుంది. ఈసారి నవంబరు 14 (శనివారం)న దీపావళి పండగ వస్తోంది. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం 15వ రోజు (కార్తీక అమావాస్య)నే దివాళి పండుగను జరుపుకుంటారు.

దీపావళి పండుగ సంపద, సుఖ సంతోషాలతో ముడి పడి ఉంది. పండుగ ముందు అందరూ ఇళ్లు, కార్యాలయాలను శుభ్రంచేసి అందంగా ముస్తాబు చేస్తారు. రంగు రంగుల లైట్లు, దీపాలతో అలంకరిస్తారు. దీపావళి రోజున వేకువ జామునే స్నానాలు చేసి.. కొత్త బట్టలు ధరించి ధనలక్ష్మికి పూజలు చేస్తారు. ఏ కష్టాలు రాకుండా చూడాలని.. ఐశ్వర్యం కలగాలని.. లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. మహిళలు ఇంట్లో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు.


diwali,is a festival,that,is pleasing,to the eyes,pooja ,కనులకు, ఇంపైన, దీపావళి, పండుగ. ఇంటి, ఆవరణలో దీపాలు


పూజల అనంతరం సాయంత్రం వేళ.. ఇంటి ఆవరణలో దీపాలు వెలిగిస్తారు. ఇంటిల్లిపాది కలిసి బాణాసంచా కాలుస్తారు. బంధులు, మిత్రులు మిఠాయిలు పంచుకుంటారు. ఒకరికి ఒకరు బహుమతులు ఇస్తారు. దీపావళి పండగ వెనక ఎన్నో పురాణ గాథలున్నాయి. 14 ఏళ్ల వనవాసం తర్వాత సీతారాముడు తిరిగొచ్చిన రోజును దీపావళిగా భావిస్తారు.

భారత సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. దీపాల వెలుగుల్లో తారాజువ్వల మోతలతో సందడిగా మారే ఈ పండుగ అశ్వయుజ మాసంలో వస్తుంది. మొత్తం మూడు రోజుల పాటూ జరుపుకునే పండుగ దీపావళి. కాగా, వాతావరణ కాలుష్యం నేపథ్యంలో ఈ సారి బాణాసంచాపై పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం పరిమిత సమయంలోనే కాల్చాలని నిబంధనలు విధించాయి.

Tags :
|
|

Advertisement