Advertisement

  • ఈ సారి డివిల్లియర్స్ కోపానికి గురి అయిన చాహల్

ఈ సారి డివిల్లియర్స్ కోపానికి గురి అయిన చాహల్

By: Sankar Sat, 06 June 2020 5:39 PM

ఈ సారి డివిల్లియర్స్ కోపానికి గురి అయిన చాహల్

లాక్ డౌన్ లో తన టిక్ టాక్ వీడియోలు సోషల్ మీడియా హంగామాతో తోటి క్రికెటర్లను అసహనానికి గురి చేస్తున్న ఆటగాడు చాహల్ ..మార్చి నుంచి దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో ఇంటికే పరిమితమైన చాహల్.. ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఫన్నీగా టిక్‌టాక్ వీడియోలు చేశాడు.

అయితే.. వాటిలో కొన్ని విసిగించేలా ఉండటంతో.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తదితరులు పెదవి విరిచారు. ఆ వీడియోలు చూసిన తర్వాత చాహల్ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడే ఆటగాడంటే ఎవరూ నమ్మరని కోహ్లీ చురకలేయగా.. చాహల్ అకౌంట్‌ని బ్లాక్ చేయమని తాను ఫిర్యాదు చేయబోతున్నట్లు గేల్ చెప్పాడు. ఇక యువరాజ్ సింగ్.. చాహల్‌ని ‘భాంగీ’లతో పోల్చాడు.. కానీ.. దానిపై వివాదం చెలరేగడంతో క్షమాపణలు చెప్పాడు.

సోషల్ మీడియాలో చాహల్ టిక్‌టాక్ వీడియోలు, ఫన్నీ చేష్టలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా.. అతను మాత్రం తన తీరుని మార్చుకోవడం లేదు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌కి అతను కోపం తెప్పించాడు. ఇటీవల సెలబ్రెటీలు చేస్తున్న స్వాంగ్ స్టెప్ ఛాలెంజ్ ని స్వీకరించిన ఏబీ డివిలియర్స్.. తన దైన శైలిలో డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి యువరాజ్ సింగ్ ‘హ్హ హ్హ.. భలే స్టెప్ట్స్ వేశావ్’ అని కితాబివ్వగా.. చాహల్ మాత్రం ‘వాట్‌ ఎ స్వాంగ్ సార్’ అని కళ్లుమూసుకున్న కోతి ఎమోజీని జత చేశాడు. దాంతో.. చిర్రెత్తిపోయిన ఏబీ డివిలియర్స్ ‘నీ హద్దుల్లో నువ్వు ఉండు’ అని ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు.


Tags :
|
|
|

Advertisement