Advertisement

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మేనేజర్ల సమావేశం

By: chandrasekar Sat, 06 June 2020 7:27 PM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మేనేజర్ల సమావేశం


జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నుంచి మహిళా సంఘాలకూ రుణాలు ఇస్తున్నామని డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు అన్నారు. చైర్మన్‌ అధ్యక్షతన బుధవారం హన్మకొండ అదాలత్‌ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మహిళా సంఘాలకు ఎలా రుణాలు ఇవ్వాలనే అంశంపై బ్రాంచ్‌ మేనేజర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో చైర్మన్‌ మాట్లాడు తూ బ్యాంకు నిబంధనలు, కాలపరిమితి మేరకు మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో రెగ్యులర్‌గా పొదుపు చేసుకుంటున్న సంఘం సభ్యులకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కుటుంబ ఆర్థిక అవసరాలు వారికి ఎంతోగానో ఉపయోగపడుతాయని అన్నారు.ఈ అవకాశాన్ని సంఘాలు సద్వినియోగంచేసుకొని ఆర్థికంగా ఎదుగాలని చైర్మన్‌ రవీందర్‌రావు సూచించారు.

వానకాల పంట సాగుమొదలౌవుతున్న క్రమంలో రైతులకు బ్యాంకునుంచి రుణాలు సకాలంలో ఇవ్వాలని, అందుకు బ్రాంచ్‌లవారీగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని మేనేజర్ల్లను ఆదేశించారు. ఈ సమావేశంలో చిరువ్యాపారులకు రుణాలు, గోల్డ్‌లోన్ల మంజూరు, రికవరీపై చర్చించారు. బ్యాంకు నుంచి ప్రతిరుణం తిరిగి చెల్లించేవిధంగా బ్యాంకు అధికారులు అవగాహన కల్పించాలని, బ్యాంకు కమర్షియల్‌బ్యాంకులకు దీటుగా కలిసికట్టుగా అందరం అంకితభావంతో పనిచేద్దామని చైర్మన్‌ సూచించారు.

ఈ సమావేశంలో వైస్‌చైర్మన్‌ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌ కే నరేందర్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లా డీఆర్డీవో సంపత్‌రావు, డీపీఎం సునీత, ఏపీఎం సునీతారాజ్‌, బ్యాంకు సీఈఓ ఉషశ్రీ, డీజీఎం అశోక్‌, ఏజీఎంలు మధు, స్రవంతి, 19 బ్రాంచ్‌ల బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

Tags :

Advertisement