Advertisement

  • డిస్నీ వ‌ర‌ల్డ్‌లో 11 వేల మంది పార్ట్‌టైమ్ వ‌ర్క‌ర్ల తొల‌గింపు

డిస్నీ వ‌ర‌ల్డ్‌లో 11 వేల మంది పార్ట్‌టైమ్ వ‌ర్క‌ర్ల తొల‌గింపు

By: chandrasekar Sat, 31 Oct 2020 5:02 PM

డిస్నీ వ‌ర‌ల్డ్‌లో 11 వేల మంది పార్ట్‌టైమ్ వ‌ర్క‌ర్ల తొల‌గింపు


వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ రిసార్ట్ వాల్ట్ డిస్నీ వ‌ర‌ల్డ్ కరోనా దెబ్బ‌కు నష్టాలపాలైంది. క‌రోనా వ‌ల్ల ఆ రిసార్ట్‌లో ప‌నిచేస్తున్న సుమారు 11 వేల మంది పార్ట్‌టైమ్ వ‌ర్క‌ర్ల‌ను తొల‌గించ‌నున్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న వాల్ట్ డిస్నీలో మ‌హ‌మ్మారి వ‌ల్ల బిజినెస్ జ‌ర‌గ‌డం లేదు. ఉద్యోగుల్ని తొల‌గిస్తున్న విష‌యాన్ని ఆ సంస్థ స్థానిక ప్ర‌భుత్వానికి కూడా తెలియజేసింది. ఈ ఏడాది చివ‌రిలోగా ద‌శ‌ల‌వారీగా ఈ తొల‌గింపు ఉంటుంది. యూనియ‌న్‌లో లేని సుమారు ఏడు వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు ఇటీవ‌ల వాల్ట్ డిస్నీ పేర్కొంది.

వాల్ట్ డిస్నీ సంస్థ మొత్తం 28 వేల మంది ఉద్యోగుల్ని త‌ప్పించేందుకు నిర్ణ‌యించింది. దాంట్లో కాలిఫోర్నియా, ఫ్లోరిడా రిసార్ట్‌లు చాలా ఫేమ‌స్‌. ఈ రెండు పార్క్‌ల్లోనే వేలాది మంది ప‌నిచేస్తుంటారు. అమెరికాలో వైర‌స్ వ్యాప్తి వ‌ల్ల మార్చిలో ఈ రెండు రిసార్ట్‌ల‌ను మూసివేశారు.

అయితే ఇటీవ‌లే ఫ్లోరిడా రిసార్ట్‌ను ఓపెన్ చేసినా నిబంధ‌న‌ల వ‌ల్ల పెద్ద‌గా విజిట‌ర్స్ రావ‌డం లేదు. మ‌రోవైపు కాలిఫోర్నియా రిసార్ట్‌ను మాత్రం ఇంకా తెర‌వ‌లేదు.

Tags :
|

Advertisement