Advertisement

  • పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు...సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు...సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

By: chandrasekar Mon, 14 Sept 2020 12:12 PM

పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు...సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపీలతో భేటీ కానున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌ల సాధనపై సీఎం జగన్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు తీసుకురావాలని ఎంపీలకు సూచించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రయోజిత పథకాల నిధులతో పాటు ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధన అజెండాగా సమావేశం నిర్వహించనున్నారు.

అలాగే కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన సహాయంపై కూడా ఎంపీలతో సీఎం జగన్ చర్చించనున్నారు. అన్ని అవకాశాలను పార్లమెంట్‌లో వినియోగించుకునేలా ముఖ్యమంత్రి జగన్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే నిర్వహించిన బీఏసీ సమావేశాంలో పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి ఏపీ డిమాండ్లను పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చర్యలు, భారత్- చైనా సరిహద్దు వివాదాలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధులు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై చర్చించాలని స్పీకర్‌ కోరినట్లు మిథున్‌రెడ్డి తెలిపారు.

Tags :

Advertisement