Advertisement

  • క్రమశిక్షణ తప్పిన పాకిస్థాన్ బ్యాట్స్మెన్ అసిఫ్ అలీ

క్రమశిక్షణ తప్పిన పాకిస్థాన్ బ్యాట్స్మెన్ అసిఫ్ అలీ

By: chandrasekar Thu, 27 Aug 2020 3:52 PM

క్రమశిక్షణ తప్పిన పాకిస్థాన్ బ్యాట్స్మెన్ అసిఫ్ అలీ


మైదానంలో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ అసిఫ్ అలీ క్రమశిక్షణ తప్పాడు. వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్‌లో ఆడుతున్న అసిఫ్ అలీ. ఔటైన కోపంలో బౌలర్ కీమో పాల్‌ని బ్యాట్‌తో కొట్టబోయాడు.

కానీ.. కీమో పాల్ కొద్దిగా దూరంగా ఉండటంతో ఎటువంటి తప్పిదం జరుగలేదు. ఆసిఫ్ అలీపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జమైకా తలైవాస్ తరఫున కీమో పాల్ ఆడుతుండగా గయానా అమెజాన్ వారియర్స్ తరఫున ఆసిఫ్ అలీ టోర్నీలో ఆడుతున్నాడు.

ట్రినిడాడ్ వేదికగా రెండు జట్ల మధ్య తాజాగా జరిగిన మ్యాచ్‌లో.. తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసిన కీమో పాల్ 9 పరుగుల వద్దే ఔటయ్యాడు.

Tags :

Advertisement