Advertisement

  • వైరల్ అవుతున్న సోను సూద్ ఏక్ నిరంజన్ మూవీ డైలాగు ..

వైరల్ అవుతున్న సోను సూద్ ఏక్ నిరంజన్ మూవీ డైలాగు ..

By: Sankar Mon, 03 Aug 2020 5:26 PM

వైరల్ అవుతున్న సోను సూద్ ఏక్ నిరంజన్ మూవీ డైలాగు ..



క‌రోనా క‌ష్ట‌కాలంలో పేద ప్ర‌జ‌ల‌కి దేవుడిలా వ‌చ్చి సాయ‌మందించిన రియ‌ల్ హీరో సోనూ సూద్‌. క‌ష్ట ఉంద‌ని అంటే వెంట‌నే సాయం అందించారు. ఎన్నో కోట్లు సంపాదించిన హీరోలు, రాజ‌కీయ నాయ‌కులు కూడా చేయ‌లేని ప‌నిని సోనూసూద్ చేసి చూపించి జ‌నాల‌తో దేవుడిగా పిలిపించుకుంటున్నాడు.

అయితే సోనూసూద్ వెండితెర‌పై ఎక్కువ‌గా విల‌న్ పాత్ర‌ల‌లో క‌నిపించిన‌ప్ప‌టికీ ఆయ‌న రియ‌ల్ హీరో అంటూ ప్ర‌జ‌లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ నెటిజ‌న్ ప్రభాస్ హీరోగా పూరీ జగన్నాథ్ రూపొందించిన `ఏక్ నిరంజన్` సినిమాలో సోనూ సూద్‌కి సంబంధించిన డైలాగ్ షేర్ చేస్తూ..

సోనూసూద్ జనాలతో ఎప్పటికైనా హీరో అనిపించుకుంటాడని మీరు ముందే ఊహించి ఈ డైలాగ్ రాసినట్టుంది పూరీ జగన్ అన్నయ్య. సోనూసూద్ భాయ్.. మీరు రియల్ హీరో` అంటూ ఓ కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన పూరీ .. `సోనూ ఎప్పుడూ హీరోనే అని నాకు తెలుసు` అని బ‌దులిచ్చారు.

Tags :
|

Advertisement