Advertisement

గురువా మీ నిర్ణయం వంద శాతం సరైనది ..లారెన్స్

By: Sankar Wed, 30 Dec 2020 08:09 AM

గురువా మీ నిర్ణయం వంద శాతం సరైనది ..లారెన్స్


అనారోగ్యకార‌ణాల రీత్యా తాను పార్టీ పెట్ట‌డం లేద‌ని త‌మిళ‌సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌క‌ట‌న అభిమానుల‌ను నిరాశ‌కు గురి చేసింది. అయితే కొంద‌రు మాత్రం ర‌జ‌నీకాంత్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నారు.

ర‌జ‌నీకాంత్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తూ ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు, కొరియోగ్రాఫ‌ర్ రాఘ‌వాలారెన్స్ ఓ ట్వీట్ చేశాడు. గురువా మీరు తీసుకున్న నిర్ణ‌యం 100 శాతం క‌రెక్ట్. మాకు అన్నింటికంటే మీ ఆరోగ్యం చాలా ముఖ్య‌మైంది. మిమ్మ‌ల్ని న‌మ్ముకుని మీ క్షేమం కోరుకుంటున్న వారికోసం నిస్వార్థ‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు.

మీరు ఇత‌రుల ప‌ట్ల తీసుకునే శ్ర‌ద్ద మిమ్మ‌ల్ని గొప్ప‌వారిని చేసింది. మీరు ఎల్ల‌ప్పుడూ ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని రాఘ‌వేంద్ర స్వామిని ప్రార్థిస్తాన‌ని ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా రేపు పార్టీ ప్రకటిస్తా అని చెప్పిన రజినీకాంత్ అనూహ్యంగా అనారోగ్య సమస్యలతో రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే...

Tags :

Advertisement