Advertisement

  • హైదరాబాద్‌లో భారత్‌ బయోటెక్ సంస్థను సందర్శించడానికి 80 దేశాల దౌత్యవేత్తలు

హైదరాబాద్‌లో భారత్‌ బయోటెక్ సంస్థను సందర్శించడానికి 80 దేశాల దౌత్యవేత్తలు

By: chandrasekar Sat, 05 Dec 2020 9:33 PM

హైదరాబాద్‌లో భారత్‌ బయోటెక్ సంస్థను సందర్శించడానికి 80 దేశాల దౌత్యవేత్తలు


హైదరాబాద్‌లో భారత్‌ బయోటెక్ సంస్థను సందర్శించడానికి 80 దేశాల దౌత్యవేత్తలు ఈనెల 9వ తేదీన రానున్నారు. కరోనా వైరస్‌కు విరుగుడు (వ్యాక్సిన్‌)పై కసరత్తు చేస్తున్న హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌ సంస్థలను సందర్శించడానికి 80 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ఈ నెల 9న హైదరాబాద్‌ రానున్నారు. ఒకేసారి భారీ సంఖ్యలో విదేశీ దౌత్యవేత్తలు నగరానికి రానుండటంతో వారి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం పర్యవేక్షించారు.

వీరి రాకపై ఏర్పాట్లు చేయడానికి చీఫ్‌ ఆఫ్‌ ప్రొటోకాల్‌ నగేశ్‌సింగ్‌, ఇతర సీనియర్‌ ఉన్నతాధికారులతో ఏర్పాట్ల గురించి సీఎస్‌ సమీక్షించారు. ప్రముఖుల పర్యటనకు కొవిడ్‌-19 ప్రొటోకాల్‌ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా సీఎస్‌ అధికారులను ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో కూడిన 5 బస్సులు, ఒక ప్రత్యేక వైద్యబృందాన్ని వారి వెంట ఉంచాలని చెప్పారు.

ఈ సందర్శనపై వారికి అవగాహన కలిగించుటకు వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించి హైదరాబాద్‌కున్న సామర్థ్యాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా చూపించాలని పేర్కొన్నారు. ఈ ప్రజెంటేషన్‌లో జీనోమ్‌ వ్యాలీ, ఫార్మాసిటీ గురించి కూడా వివరించాలని సూచించారు. వివిధ దేశాల రాయబారులు, హై కమిషనర్ల పర్యటనను విదేశాంగ మంత్రిత్వశాఖ నిర్వహిస్తున్నదని తెలిపారు. మన హైదరాబాద్ మెడికల్ హబ్ గా ఉద్బవించినందువల్ల వారి దేశాలకు కావలసిన ఔషదాలకోసం ఇక్కడ రావాల్సివుంది.

Tags :
|

Advertisement