Advertisement

  • ధోని జెర్సీ నెంబర్ 7 కు రిటైర్మెంట్ ఇవ్వాలని బీసీసీఐ ను కోరిన భారత క్రికెటర్

ధోని జెర్సీ నెంబర్ 7 కు రిటైర్మెంట్ ఇవ్వాలని బీసీసీఐ ను కోరిన భారత క్రికెటర్

By: Sankar Sun, 16 Aug 2020 3:03 PM

ధోని జెర్సీ నెంబర్ 7 కు రిటైర్మెంట్ ఇవ్వాలని బీసీసీఐ ను కోరిన భారత క్రికెటర్


టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ జెర్సీ నంబర్ 7 అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. ఆ జెర్సీ నంబర్ ధరించిన మహీ ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించడంతో పాటు వ్యక్తిగత రికార్డులను కూడా నెలకొల్పాడు.

ఇకపై ధోనీ జెర్సీ నంబర్ 7 ఇతర క్రికెటర్లు ధరించకుండా నిషేధం విధించాలని పలువురు క్రికెటర్లతో పాటు అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతని సేవలకు గుర్తింపుగా ఆ జెర్సీని ఇతర క్రికెటర్లు ధరించకుండా బీసీసీఐ నెం.10 జెర్సీకి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

మహీ గౌరవార్థం నంబర్‌ ‘7’కు శాశ్వత రిటైర్మెంట్‌ ప్రకటించాలని వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ ట్విటర్‌ వేదికగా కోరాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో జెర్సీ #7కు బీసీసీఐ వీడ్కోలు పలుకుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్‌ చేశాడు. జీవితంలో ధోనీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ కూడా గొప్పగా ఉండాలని ఆకాంక్షించాడు. ఈ సందర్భంగా ధోనీతో వరల్డ్‌కప్‌ సెమీస్‌ మ్యాచ్‌ సమయంలో దిగిన ఫొటోను షేర్‌ చేశాడు.

Tags :
|

Advertisement