Advertisement

  • టాలీవుడ్ ప్రముఖులకు దిల్ రాజు గ్రాండ్ పార్టీ...

టాలీవుడ్ ప్రముఖులకు దిల్ రాజు గ్రాండ్ పార్టీ...

By: chandrasekar Thu, 17 Dec 2020 1:13 PM

టాలీవుడ్ ప్రముఖులకు దిల్ రాజు గ్రాండ్ పార్టీ...


తెలుగు ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన నిర్మాతల్లో దిల్ రాజు ఒకడు. ఈయన కథను ఓకే చేస్తే అది హిట్ అనే నమ్మకం కూడా ప్రేక్షకుల్లో ఉంది. మూడేళ్ల కింద దిల్ రాజు మొదటి భార్య అనిత అనారోగ్యంతో కన్నుమూసారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు ప్రస్తుతం

తనకు తెలిసిన అమ్మాయి తేజస్విని పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి నాందీ పలికాడు. ఇదిలా ఉంటే దిల్ రాజు పెళ్లి చాలా నిరాడంబరంగా జరిగింది. డిసెంబర్ 18న ఈయన 50వ పుట్టిన రోజు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖులకు పార్టీ ఇవ్వబోతున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరికీ పార్టీ ఇవ్వలేదు. ఈ పెళ్లికి సంబంధించిన పార్టీని తన పుట్టిన రోజుతో కలిపి ఇవ్వనున్నాడు.

ఈ సందర్బంగా టాలీవుడ్ ప్రముఖులందరికీ కూడా ఆహ్వానాలు అందాయని సమాచారం. ఈ పార్టీలోనే త‌న భార్య‌ తేజస్వినిని అందరికీ పరిచయం చేయబోతున్నాడు ఈయన. దీనికోసం భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం దిల్ రాజు ఫుల్ బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ప్రాజెక్ట్ వకీల్ సాబ్ తో పాటు హిందీ జెర్సీ రీమేక్, ఎఫ్ 3తో పాటు మరో మూడు సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి.

Tags :
|

Advertisement