Advertisement

పెట్రోల్ ‌ధర కంటే డీజిల్ ధర అధిగం

By: chandrasekar Thu, 25 June 2020 6:46 PM

పెట్రోల్ ‌ధర కంటే డీజిల్ ధర అధిగం


డీజిల్ ధర ఎప్పుడూ పెట్రోల్ ధర కంటే తక్కువగా ఉంటుందని మనందరికీ ఒక అంచనా ఉండేది. కానీ ఆ అంచనానే ఇప్పుడు తలకిందులైంది. ఎవ్వరూ ఊహించని రీతిలో డీజిల్ ధర పెట్రోల్ ధరను అధిగమించడం భారత మార్కెట్లో ఇదే మొదటిసారి.

గత 18రోజుల నుంచి దేశంలో ప్రతీరోజు పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బీపీసీల్, ఐఓసీ మరోసారి ధరలను పెంచాయి.

ఈ సారి పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు కానీ డీజిల్ ధరను మాత్రం లీటరుకు 48పైసలను పెంచాయి. దీంతో బుధవారం ధరలు పెరిగిన తరువాత ఢిల్లీ లో లీటర్ డీజిల్ ధర రూ.79.88 కాగా, పెట్రోల్ ధర రూ.79.76గా ఉంది.

ఒకవైపు గత 15 రోజులుగా ముడి చమురు ధర బ్యారెల్కు 35-40 డాలర్ల మధ్య ఉన్నా మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరగుతుండటం గమనార్హం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత 18 రోజుల్లో పెట్రోల్ ధరను సుమారు రూ.8.50 పెంచగా, డీజిల్ ధరను రూ .10.25 పెంచింది.

Tags :
|
|
|

Advertisement