Advertisement

  • లీటర్‌‌‌‌ డీజిల్‌‌, పెట్రోల్‌‌ రేట్లు రూ. 4, 5 లు పెరిగే అవకాశం

లీటర్‌‌‌‌ డీజిల్‌‌, పెట్రోల్‌‌ రేట్లు రూ. 4, 5 లు పెరిగే అవకాశం

By: chandrasekar Fri, 29 May 2020 5:47 PM

లీటర్‌‌‌‌ డీజిల్‌‌, పెట్రోల్‌‌ రేట్లు రూ. 4, 5 లు పెరిగే అవకాశం


పెట్రోల్‌‌, డీజిల్‌‌ ధరల మోతను తట్టుకునేందుకు కన్జూమర్లు సిద్ధంగా ఉండాలి. వచ్చే నెలలో లీటర్‌‌‌‌ డీజిల్‌‌, పెట్రోల్‌‌ రేట్లు రూ. 4 నుంచి 5 లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం లాక్‌‌డౌన్‌‌ రూల్స్‌‌ను సడలిస్తుండడంతో ఇండియన్‌‌ ఆయిల్‌‌‌‌ కంపెనీలు పెట్రోల్‌‌, డీజిల్‌‌పై మళ్లీ రోజూ రేట్లను మార్చడానికి సిద్ధ పడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను అంచనావేయడం, రోజువారీగా ఫ్యుయల్‌‌ ధరలను సవరించడంపై ఇండియన్‌‌ ఆయిల్‌‌ మార్కెటింగ్‌‌ కంపెనీలు గత వారం మీటింగ్‌‌ పెట్టుకున్నాయని సంబంధిత వ్యక్తులు తెలిపారు. లాక్‌‌డౌన్‌‌ 5.0 ను ప్రకటించినా, డైలీ ఫ్యుయల్‌‌ రేట్లను రివిజన్‌‌ చేసుకోవడానికి ఓఎంసీలకు ప్రభుత్వం అనుమతిస్తుందని అంచనావేశారు.

గత నెలలో ఇంటర్నేషనల్‌‌గా బ్రెంట్‌‌క్రూడ్‌‌ ధర బ్యారెల్‌‌ 20 డాలర్ల దిగువకు పడిపోయిన విషయం అందరికి తెలిసిందే. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌‌, డీజిల్‌‌పై ఎక్సైజ్‌‌, వ్యాట్‌‌లను మరింత పెంచడంతో ఆయిల్‌‌ ధరలు మనకు తగ్గలేదు. ప్రస్తుతం బ్రెంట్‌‌ క్రూడ్‌‌ గ్లోబల్‌‌ మార్కెట్‌‌లో 30 డాలర్లకు చేరుకుంది. ఇది మరింత పెరిగితే ఇండియన్‌‌ ఓఎంసీలు కూడా నష్టాలను తగ్గించుకోవడానికి ధరలు పెంచే అవకాశం ఎక్కువగా ఉంది.

diesel,petrol,rates,rupees,likely ,లీటర్‌‌‌‌, డీజిల్‌‌, పెట్రోల్‌‌, రేట్లు, పెరిగే


ప్రస్తుతం పెట్రోల్‌‌, డీజిల్‌‌ ఉత్పత్తి వ్యయం, అమ్ముతున్న రేటుకు మధ్య రూ. 4–5 లు వ్యత్యాసం వచ్చిందని ఓఎంసీ అధికారి అన్నారు. గ్లోబల్‌‌గా ఆయిల్‌‌ ధరలు సడెన్‌‌గా పెరగకపోతే కొంత టైమ్‌‌లో ఈ గ్యాప్‌‌ను దశల వారిగా ఓఎంసీలు తగ్గించుకునే అవకాశం ఉంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి రోజుకి 40–50 పైసలు చొప్పున పెట్రోల్‌‌, డీజిల్‌‌ ధరలను ఓఎంసీలు పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

కంపెనీల ఉత్పత్తి వ్యయానికి, అమ్మే ధరకు మధ్య వ్యత్యాసం తగ్గేంత వరకు పెట్రోల్‌‌, డీజిల్‌‌ ధరల్లో మార్పులు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతివ్వొచ్చని సంబంధిత వ్యక్తులు అన్నారు. కానీ ఒక స్థాయికి చేరుకున్నాక వీటి ధరలను మరింత పెంచడానికి ప్రభుత్వం అంగీకరించక పోవచ్చని అభిప్రాయపడ్డారు. గ్లోబల్‌‌ ఆయిల్‌‌ మార్కెట్‌‌ను బట్టి ఇండియాలో పెట్రోల్‌‌, డీజిల్‌‌ ధరలలో డైలీగా మార్పులుంటాయనే విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్‌‌ మార్కెట్లో ఆయిల్‌‌ ధరలు పెరుగుతున్నప్పటికి లాక్‌‌డౌన్‌‌ దెబ్బతో ఇండియాలో డిమాండ్‌‌ భారీగా పడిపోయింది.

Tags :
|
|
|
|

Advertisement