Advertisement

  • టీమిండియా మూడో పేసర్‌ ఎవరన్న విషయం రవిశాస్త్రి ఇయాన్‌ చాపెల్ కు చెప్పాడా..?

టీమిండియా మూడో పేసర్‌ ఎవరన్న విషయం రవిశాస్త్రి ఇయాన్‌ చాపెల్ కు చెప్పాడా..?

By: chandrasekar Thu, 10 Dec 2020 9:48 PM

టీమిండియా మూడో పేసర్‌ ఎవరన్న విషయం రవిశాస్త్రి ఇయాన్‌ చాపెల్ కు చెప్పాడా..?


ఆసీస్‌తో భారత్ మొదటి టెస్టు డిసెంబర్‌ 17 నుంచి ప్రారంభం అవుతుంది. టీమిండియా బౌలెర్స్ లో మూడో సీమర్‌ ఎవరని చర్చ జరుగుతోంది. తొలి టెస్టులో మూడో పేసర్‌ ఎవరన్నది తనకు తెలుసని ఆసీస్‌ మాజీ ఆటగాడు ఇయాన్‌ చాపెల్‌ చెప్పాడు. మూడో పేసర్‌గా ఉమేశ్‌ యాదవ్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నాడు. ఈ విషయాన్ని తనకు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పినట్లు ఇయాన్ చాపెల్ తెలిపాడు. టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రితో కలిసి సరదాగా డ్రింక్‌ తాగుతున్న సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చింది. తొలి టెస్టుకి టీమిండియాలో మూడో పేసర్‌ అవసరం ఉందని ఇషాంత్‌ గైర్హాజరీలో అనుభవం దృష్యా ఉమేశ్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని శాస్త్రి నాతో చెప్పాడని ఆయన అన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియా తొలి టెస్టును డే నైట్‌లో ఆడడం సానుకూలాశంగా మారనుంది. ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టులో మహ్మద్‌ షమీ, బుమ్రాలు కీలకంగా మారారని ఉమేశ్‌ లాంటి బౌలర్‌ ఉంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఒకవేళ భారత్‌ మొదటి బ్యాటింగ్‌ చేసి 300 పరుగులు సాధిస్తే గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. మొదటి టెస్టు తర్వాత కోహ్లి స్వదేశానికి వెళ్లనున్న నేపథ్యంలో టీమిండియాకు మిగిలిన టెస్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యే చాన్స్‌లు ఉన్నాయని చాపెల్ అన్నాడు. వాస్తవానికి ఆసీస్‌ టూర్‌కు మొదట ఇషాంత్‌ శర్మ మూడో పేసర్‌గా ఎంపికయ్యాడు. అయితే ఐపీఎల్‌ 13వ సీజన్‌ సందర్భంగా ఇషాంత్‌ గాయపడడంతో ఆసీస్‌ టూర్‌ నుంచి తప్పించారు. అతని స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ను తీసుకున్నారు. ప్రస్తుతం టీమిండియా పేస్‌ బౌలింగ్‌ దళంలో షమీ, బుమ్రాలతో పాటు ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ సైనీ, మహ్మద్‌ సిరాజ్‌లు ఉన్నారు. కోహ్లి స్థానంలో అజింక్యా రహానే మిగిలిన మూడు టెస్టులకు కెప్టెన్‌గా పనిచేయనున్నాడు. జట్టు గురించి ఇతరులకు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని టీమిండియా ఫ్యాన్స్ అడుగుతున్నారు.

Tags :
|

Advertisement