Advertisement

నిరుద్యోగికి రూ.30 ల‌క్ష‌ల విలువ‌చేసే డైమండ్

By: chandrasekar Sat, 07 Nov 2020 2:21 PM

నిరుద్యోగికి రూ.30 ల‌క్ష‌ల విలువ‌చేసే డైమండ్


నిరుద్యోగికి రూ.30 ల‌క్ష‌ల విలువ‌చేసే డైమండ్ దొరకడంతో లక్షణాధికారి అయ్యాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ యువ‌కుడిని ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హించింది. ఉద్యోగ నియ‌మ‌కాలు వాయిదా ప‌డ్డాయ‌ని బాధ‌ప‌డుతున్న ఆ నిరుద్యోగిని అదృష్టం ఆవ‌హించింది. ప‌న్నా మైన్‌లో ల‌క్ష‌ల విలువ చేసే డైమండ్ దొర‌క‌డంతో అత‌డు రాత్రికిరాత్రే ల‌క్షాధికారి అయ్యాడు. దీని వివ‌రాల్లోకి వెళ్తే మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం బుందేల్‌ఖండ్ జిల్లా క్రిష్ణ క‌ళ్యాణ్‌పూర్ ఏరియాకు చెందిన సందీప్ యాద‌వ్ పోలీస్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు.

కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. ఇటీవ‌ల క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించ‌డంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌ర్కారు ఉద్యోగ నియామ‌క ప్ర‌క్రియ‌ను నిలిపేసింది. దాంతో ఖాళీగా ఉండ‌టం ఎందుక‌ని ప‌న్నా డైమండ్‌ మైన్‌లోని కొంత ప్ర‌దేశాన్ని ప్ర‌భుత్వం నుంచి లీజుకు తీసుకున్నాడు. ఆ ప్ర‌దేశంలో డైమండ్స్ కోసం వెతుక‌గా అత‌నికి రూ.30 ల‌క్ష‌ల విలువ‌చేసే 6.92 క్యారెట్ డైమండ్ దొరికింది.

తనకు దొరికిన ఆ డైమండ్‌ను స్థానిక డైమండ్ సెంట‌ర్‌లో డిపాజిట్ చేశాడు. ఆ డైమండ్ సెంట‌ర్ దాన్ని వేలంవేసి అందులో నుంచి 2.5 శాతం రాయ‌ల్టీని తీసుకుని మిగిలిన న‌గ‌దు మొత్తాన్ని సందీప్‌యాదవ్‌కు అంద‌జేయ‌నుంది. కాగా, ప‌న్నా గ‌నిలో గ‌త నెల రోజుల వ్య‌వ‌ధిలో డైమండ్ దొరికిన నాలుగో వ్య‌క్తి సందీప్‌యాద‌వ్ కావ‌డం గ‌మ‌నార్హం. అదృష్టం అంటే ఇలా కలిసిరావాలి మరి.

Tags :
|
|

Advertisement