Advertisement

కోటి విలువ చేసే వాజ్రం దొరికింది

By: chandrasekar Sat, 23 May 2020 5:30 PM

కోటి విలువ చేసే వాజ్రం దొరికింది


అనంతపురం గుత్తి మండలం బేతాపల్లికి చెందిన రైతుకు ఊరి శివారులో ఊటకల్లుకు వెళ్లే దారిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి భూమి మొత్తం పదును కావడంతో రైతు వ్యవసాయం పనులు ప్రారంభించాడు. ఆరైతుకి కోటి రూపాయలు విలువచేసే వజ్రం దొరికింది. అతను దాన్ని గుట్టుచప్పుడు కాకుండా అమ్మడానికి ప్రయత్నిచాడు. రేటు విషయంలో తేడా రావడంతో గుట్టు మొత్తం బయటపడింది.

ఆ రైతు గుంటకతో భూమిని దున్నడంతో ఓ వజ్రం బయటపడింది. ఆ రైతు ఆ వజ్రం దొరికిన విషయాన్ని మరో ఇద్దరికి మాత్రమే చెప్పాడు. ఆ తర్వాత గ్రామంలోని ఇద్దరు వ్యక్తులతో కలిసి రహస్యంగా వజ్రాన్ని కర్నూలు జిల్లాలోని పెరవలిలో విక్రయించేందుకు ప్రయత్నించాడు. కానీ అక్కడ ధర విషయంలో తేడా వచ్చింది. దీంతో రైతు గుత్తి ఆర్‌ఎస్‌లోని ఓ వ్యాపారికి రూ.30 లక్షలకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే రైతుకు వజ్రం దొరికిన విషయం బయటపడింది. రైతుకు దొరికిన ఆ వజ్రం ధర కోటి రూపాయలకు పైగా ఉంటుందని మధ్యవర్తులు వజ్రాల వ్యాపారితో కుమ్మక్కై రైతుకు తక్కువ ధర ఇచ్చినట్లు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ రైతు వివరాలు ఇంకా తెలియ రాలేదు.

Tags :
|
|
|

Advertisement