Advertisement

ఆగస్టు 22న యూఏఈకి బయలు దేరనున్న ధోనీ టీమ్

By: chandrasekar Sat, 08 Aug 2020 2:48 PM

ఆగస్టు 22న యూఏఈకి బయలు దేరనున్న ధోనీ టీమ్


యూఏఈ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్‌ ఐపీఎల్‌-13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కాబోతోంది. లీగ్‌ కోసం ఎనిమిది ఫ్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఆటగాళ్ల ప్రయాణం, వసతి, ఇతర ఏర్పాట్ల కోసం సన్నాహాలు మొదలయ్యాయి. లీగ్‌ కోసం ఫ్రాంఛైజీలు పాటించాల్సిన విధివిధానాలను రూపొందించారు. ఐపీఎల్‌కు సంబంధించి ఎస్‌ఓపీలను 8 ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఇప్పటికే అందజేసింది. ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నాయి. ఆటగాళ్లు తమ సొంతూళ్లలోనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నాయి.

బీసీసీఐ ఎస్‌ఓపీ నిబంధనల ప్రకారం యూఏఈకి బయల్దేరడానికి వారం ముందే 24 గంటల వ్యవధిలో రెండుసార్లు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. చాలా జట్లు బీసీసీఐ నిర్దేశించిన ఆగస్టు 20 తర్వాత భారత్‌ నుంచి యూఏఈకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాత్రం ఆగస్టు 22న బయలుదేరాలనుకుంటున్నది. ముంబై ఇండియన్స్‌ ఇప్పటికే తన జట్టు ఆటగాళ్లను క్వారంటైన్‌లో ఉంచింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఆటగాళ్లకు ఫ్రాంఛైజీలు ముందుజాగ్రత్త చర్యగా కొవిడ్ టెస్టుల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tags :
|
|
|
|

Advertisement