Advertisement

  • ధోని విషయంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ..2022 వరకు ఆడతాడు ..సిఎస్కె సీఈవో కాశీ విశ్వనాథన్

ధోని విషయంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ..2022 వరకు ఆడతాడు ..సిఎస్కె సీఈవో కాశీ విశ్వనాథన్

By: Sankar Thu, 13 Aug 2020 10:42 AM

ధోని విషయంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ..2022 వరకు ఆడతాడు ..సిఎస్కె  సీఈవో కాశీ విశ్వనాథన్



ఐపీయల్ పదమూడవ సీజన్ కు అన్ని జట్లు సన్నాహాలు ప్రారంభించాయి ..కరోనా కారణంగా ఇంతకాలం వాయిదా పడిన ఐపీయల్ త్వరలో మొదలవబోతుంది ..అయితే ఇండియాలో ఇంకా కరోనా తగ్గుముఖం పెట్టకపోవడంతో ఐపీయల్ వేదికను యూఏఈ కి మార్చారు.. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఈ మెగాటోర్నీ జరుగుతుందని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేయగా.. ఆగస్టు 20 తర్వాత ఐపీఎల్ జట్లనీ అక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి..

అయితే ఈ ఐపీయల్ అన్నిటికంటే ఎక్కువగా ఆసక్తిని కలిగిస్తున్నది మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ , దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని నే , దాదాపు ఏడాదిన్నర కావొస్తుంది ధోని మైదానంలో బరిలోకి దిగి , దీనితో ఎప్పుడెప్పుడు ధోనిని మైదానంలో చూస్తామా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు..

కాగా మహేంద్రసింగ్ ధోనీ ఇటీవల రాంచీలోని క్రికెట్ స్టేడియంలో ఒక సెషన్‌పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు ఝార్ఖండ్ క్రికెట్ అసోషియేషన్ (జే‌ఏసీ) అధికారి ఒకరు తెలిపారు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉండిపోయిన ధోనీ.. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కానీ.. ధోనీ కెరీర్ ఇప్పటికే ముగిసిపోయిందని.. ఐపీఎల్ 2020 సీజన్ అతని కెరీర్‌లో ఆఖరి టోర్నీ అంటూ కొంత మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

ధోనీ రిటైర్మెంట్ రూమర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ తాజాగా మాట్లాడుతూ ‘‘ఐపీఎల్ 2020, 2021 సీజన్‌లో ధోనీ ఆడతాడని మేము ముందే ఊహించాం. నా అంచనా ప్రకారం 2022 ఐపీఎల్ సీజన్‌లోనూ ధోనీ ఆడతాడు. ఝార్ఖండ్‌లో ధోనీ బ్యాటింగ్ ప్రాక్టీస్ గురించి మీడియా ద్వారానే నాకు తెలిసింది. అయినా.. మా కెప్టెన్ ఫామ్ గురించి మాకేమీ కంగారు లేదు. ధోనీకి అతని బాధ్యతలు ఏంటో..? బాగా తెలుసు’’ అని వెల్లడించాడు.

Tags :
|
|
|
|

Advertisement