Advertisement

  • ధోని మునుపటిలాగా ఆడలేకపోతున్నాడు ..బ్రియాన్ లారా

ధోని మునుపటిలాగా ఆడలేకపోతున్నాడు ..బ్రియాన్ లారా

By: Sankar Sun, 11 Oct 2020 08:41 AM

ధోని మునుపటిలాగా ఆడలేకపోతున్నాడు ..బ్రియాన్ లారా


ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఎంఎస్‌ ధోని పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ధోని పేలవ బ్యాటింగ్‌ ప్రదర్శన చెన్నై జట్టును కలవరపెడుతుంది. ఈ విషయమై వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా మాట్లాడారు.

'ధోని అద్భుతమైన 'ఫినిషర్‌‌', అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు అతడికి అనుకూలంగా లేవు. ఛేదనలో మునుపటి ధోనిలా ఆడలేకపోతున్నాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 11(12) పరుగులే చేయగలిగాడు. ఆ మ్యాచ్‌లో జడేజా బాగా ఆడాడు. డ్వేన్‌ బ్రావోకు కూడా ఆ జట్టులో సరైన అవకాశం లభించడం లేదు. ఫినిషింగ్‌ బాధ్యతలు వేరొకరికి ఇస్తే బాగుంటుంది' అని లారా అభిప్రాయపడ్డారు.

ఇక నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తో జరిగిన మ్యాచ్ లో కూడా ధోని మరొకసారి విఫలం అయ్యాడు ..దీనితో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరొక ఘోర ఓటమిని మూటకట్టుకుంది..చెన్నై మిడిల్ ఆర్డర్ వైఫల్యం మరొకసారి బయటపడింది..దీనితో చెన్నై జట్టు ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో చివరి బాగాన నిలిచింది..

Tags :
|

Advertisement