Advertisement

  • క్రికెట్ లెజెండ్ రిటైర్మెంట్ పై ప్రధాని రాసిన లేఖకు ధోని ట్విట్టర్ ద్వారా స్పందన

క్రికెట్ లెజెండ్ రిటైర్మెంట్ పై ప్రధాని రాసిన లేఖకు ధోని ట్విట్టర్ ద్వారా స్పందన

By: chandrasekar Fri, 21 Aug 2020 09:31 AM

క్రికెట్ లెజెండ్ రిటైర్మెంట్ పై ప్రధాని రాసిన లేఖకు ధోని ట్విట్టర్ ద్వారా స్పందన


క్రికెట్ లెజెండ్ MS ధోని రిటైర్మెంట్ పై ప్రధాని రాసిన లేఖకు ధోని ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెబుతున్నట్టు టీమిండియా లెజెండరీ మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల చేసిన ప్రకటన క్రికెట్ ప్రియుల అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఎంతోమంది ధోని అభిమానులను ఆవేదనకు గురి చేసిన రిటైర్మెంట్ ప్రకటనపై ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. ఇండియా టీంకు గొప్ప విజయాలు అందించిన కెప్టెన్ గా ధోని కు మంచి గుర్తింపు లభించింది.

ట్వంటీ 20 వరల్డ్ కప్ కరోనా కారణంగా వాయిదా వేయడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీకి ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఓ లేఖ రాశారు. 'టీమిండియాకు ధోనీ అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ధోనీని అభినందించిన ప్రధాని మోదీ క్రికెట్‌లో ఉత్తమ కెప్టెన్‌గా, ఉత్తమ వికెట్ కీపర్‌గా ధోనీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది' అని ప్రశంసల్లో ముంచెత్తారు. ధోనీ భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉండాలి అని ఆశిస్తున్నట్టు ధోనికి రాసిన లేఖలో ప్రధాని తన ఆకాంక్షను వ్యక్తపరిచారు. రిటైర్మెంట్ తరువాత చాలామంది నుండి గొప్ప పురస్కారాలు ధోని అందుకుంటున్నాడు.

మన ప్రధాని నరేంద్ర మోదీ గారు రాసిన లేఖకు ధోనీ స్పందిస్తూ కళాకారులు, సైనికులు, క్రీడాకారులు తపించేది ఎదుటివారి అభినందన కోసమే అని అభిప్రాయపడ్డారు. తాము పడిన కష్టం, చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు దక్కాలనే వారు కోరుకునేది. అలాగే తనను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు అని ప్రధాని మోదీకి ట్విట్టర్ ద్వారా ధోని ట్వీట్ చేసాడు. ధోని రిటైర్మెంట్ చాలామంది క్రికెట్ అభిమానులకు నిరాశను కలిగించింది.

Tags :
|

Advertisement