Advertisement

  • నేను అర్హుడిని అని బావించినాకనే ధోని నాకు కెప్టెన్సీ ఇచ్చాడు ...కోహ్లీ

నేను అర్హుడిని అని బావించినాకనే ధోని నాకు కెప్టెన్సీ ఇచ్చాడు ...కోహ్లీ

By: Sankar Sun, 31 May 2020 8:57 PM

నేను అర్హుడిని అని బావించినాకనే ధోని నాకు కెప్టెన్సీ ఇచ్చాడు ...కోహ్లీ

టీం ఇండియా కు అత్యంత విజయవంతం అయిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ..కెప్టెన్గా ధోని సాధించని రికార్డు లేదు ..ఒక టి ట్వంటీ ప్రపంచ కప్ , ఒక వన్ డే ప్రపంచ కప్ , ఒక ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా అన్ని రకాలుగా ఇండియా కు విజయాలను అందించి గ్రేట్ కెప్టెన్ గా నిలిచాడు ..అయితే ధోని తర్వాత కెప్టెన్ గా కోహ్లీకి బాధ్యతలను అప్పగించాడు..ఆ నిర్ణయంపై ఎలాంటి వివాదాలు, విమర్శలు, చర్చలు ఏవీ కనబడలేదు. దానికి కారణం విరాట్ కోహ్లీ ఆ కెప్టెన్సీకి అర్హుడని అందరూ భావించడమే.

వాస్తవానికి కెప్టెన్సీ బదిలీ వ్యవహారం ఒక్కరోజులే ఏమీ జరిగిపోలేదు. దాదాపు ఆరేడేళ్ల పాటు తన సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలించిన ధోనీ.. ఆఖరిగా బాధ్యతలు అప్పగించినట్లు విరాట్ కోహ్లీనే స్వయంగా వెల్లడించాడు. టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో మాట్లాడిన కోహ్లీ.. పలు ఆసక్తికరమైన విషయాల్ని అతనితో పంచుకున్నాడు. కెప్టెన్‌గా ధోనీ కొన్ని సార్లు తన ఆలోచనల్ని వ్యతిరేకించాడని గుర్తు చేసుకున్న కోహ్లీ.. అతని నుంచి కెప్టెన్సీపరంగా చాలా విషయాల్ని నేర్చుకున్నట్లు వెల్లడించాడు.

dhoni,kohli,captaincy,india,cricket ,అత్యంత విజయవంతం ,కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోని ,విరాట్ , రవిచంద్రన్ అశ్విన్‌

ధోనీ పక్కన స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేసే సమయంలో.. మనం ఈ వ్యూహంతో వెళ్దామా..? అని తరచూ అడిగేవాడ్ని. కొన్ని సందర్భాల్లో నా ప్లాన్స్‌ని ధోనీ వ్యతిరేకించాడు. కానీ.. చాలా సందర్భాల్లో నాతో చర్చలు జరిపేవాడు. ఆ క్రమంలో నేను కెప్టెన్సీకి తగినవాడినని ధోనీ భావించాడు. అలా అని కెప్టెన్సీ బదిలీ వ్యవహారం రాత్రికి రాత్రే ఏమీ జరిగిపోలేదు. దాదాపు ఆరేడేళ్లపాటు ధోనీ నా తీరుని పరిశీలించి.. నమ్మకం వచ్చిన తర్వాతే బాధ్యతలు అప్పగించాడు’’ అని కోహ్లీ వెల్లడించాడు.

Tags :
|
|
|

Advertisement