Advertisement

  • అశేష జన అభిమానం కలిగిన ధోనీ ప్రపంచంలో ఉత్తమ వికెట్ కీపర్: ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌

అశేష జన అభిమానం కలిగిన ధోనీ ప్రపంచంలో ఉత్తమ వికెట్ కీపర్: ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌

By: chandrasekar Fri, 07 Aug 2020 09:11 AM

అశేష జన అభిమానం కలిగిన ధోనీ ప్రపంచంలో ఉత్తమ వికెట్ కీపర్: ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌


వికెట్ కీపర్‌గా,బాట్స్‌మెన్‌గా ఎన్నో రికార్డులు సాధించిన ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ చాలా మందికి ఫెవరెట్ ఆటగాడు. ఆసీస్ జట్టుకు విసృత సేవలు అందించిన గిల్ 2008లో రిటైర్‌మెంట్ ప్రకటించాడు.

అప్పటినుంచి ఎక్కువ సమయం కుటుంబంతో గడుపుతున్నారు. తాజాగా తనకు నచ్చిన ఉత్తమ వికెట్‌ కీపర్‌ ఎవరో చెప్పాడు. ధోనీ, కుమార సంగక్కర, మెక్‌కల్లమ్‌, మార్క్‌ బౌచర్‌ ఉత్తమ కీపర్లు అంటూ పేర్కొన్నా గిల్లీ వీరిలో భారత మాజీ కెప్టెనే ఉత్తమం అని తెలిపారు.

తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ " నాకు ధోనీయే ఫెవరెట్ కీపర్, నేను గిల్లీని.. సిల్లిగా మాట్లాడాను. అశేష జన అభిమానం కలిగిన ధోనీ ప్రపంచంలో ఉత్తమ వికెట్ కీపర్, ఆయన తర్వాత సంగక్కర, మెక్‌కల్లమ్‌, బౌచర్‌ ఉంటారని’ పెర్కొన్నారు. ఎంతటి ఓత్తడిలోనైనా ధోనీ ప్రశాంతంగా ఉండడం ప్రశంసనీయమన్నారు. క్రికెట్ లో ఈ మాజీ సారథి ప్రభావం ఎప్పటికి ఉంటుందన్నారు.

Tags :
|

Advertisement