Advertisement

  • ధోని తన విశ్వాసంతో, ప్రత్యక్షతతో తన తోటివారిలో ధైర్యాన్ని నింపుతాడు: గ్రెగ్ చాపెల్

ధోని తన విశ్వాసంతో, ప్రత్యక్షతతో తన తోటివారిలో ధైర్యాన్ని నింపుతాడు: గ్రెగ్ చాపెల్

By: chandrasekar Sat, 29 Aug 2020 4:36 PM

ధోని తన విశ్వాసంతో, ప్రత్యక్షతతో తన తోటివారిలో ధైర్యాన్ని నింపుతాడు:  గ్రెగ్ చాపెల్


ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఎంఎస్ ధోనిని క్లైవ్ లియోడ్, మైక్ బ్రెయర్లీ, ఇయాన్ చాపెల్, మార్క్ టేలర్లతో పోల్చాడు ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్‌, ఇండియా మాజీ హెడ్ కోచ్ గ్రెగ్ చాపెల్. ప్రపంచ క్రికెట్‌లో గత 50 ఏండ్లలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ధోని కూడా ఒకడని పొగిడారు. ఎంఎస్ ధోని 2004 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో వన్డేలో అడుగుపెట్టిన కొద్ది నెలలకే భారత ప్రధాన కోచ్‌గా వచ్చిన చాపెల్ ధోని తాను చూసిన ఉత్తమ భారత కెప్టెన్ అని పేర్కొన్నారు.

2005 నుంచి రెండు సంవత్సరాలు భారత ప్రధాన శిక్షకుడిగా ఉన్న చాపెల్ మాట్లాడుతూ ... 'ధోని ప్రత్యేక లక్షణం అతడి విశ్వాసం, ప్రత్యక్షత. ఈ విశిష్టమైన లక్షణం అతడి ఆత్మ విశ్వాసం. అతడు తన విశ్వాసంతో, ప్రత్యక్షతతో తన తోటివారిలో ధైర్యాన్ని నింపుతాడు. ఎంఎస్‌ ధోని ఆటలో దయతో స్పందిస్తాడని’ చాపెల్‌ అన్నాడు. ‘ధోనితో నా అనుభవం సానుకూలంగా ఉంది. అతను ఏ విషయంలోనైనా ఓపెన్‌గా ఉంటాడు. దీనివల్ల అతడితో పనిచేయడం సులువుగా ఉంటుంది. ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేసేస్తాడు. నేను ధోనిలో హాస్యాన్ని ఆస్వాధిస్తాను. అతడు సవాళ్లను ఇష్టపడే క్రికెటర్. ఉత్తమ క్రికెటర్‌లో ఉన్న అన్ని లక్షణాలు ధోనిలో ఉన్నాయ’ని చాపెల్‌ పేర్కొన్నాడు.

Tags :
|

Advertisement