Advertisement

ధోనీది ప్రత్యేకమైన శైలి ..తైబు

By: Sankar Tue, 09 June 2020 5:32 PM

ధోనీది ప్రత్యేకమైన శైలి ..తైబు

ప్రపంచ క్రికెట్ లో అత్యున్నత కీపర్లలో ధోని ఒకడు ..కేవలం తనకు మాత్రమే సాధ్యం అయిన టైమింగ్తో రెప్పపాటులో రన్అవుట్ లు చేయడంలో ధోనికి ధోనీనే సాటి..అయితే ధోని కీపింగ్ సహజంగా కనిపించడం లేదని జింబాబ్వే మాజీ వికెట్ కీపర్ తైబు అభిప్రాయపడ్డాడు. ధోనీ కీపింగ్‌ని సుదీర్ఘకాలంగా తాను చూస్తున్నాని చెప్పుకొచ్చిన తైబు.. అతనితో పోలిస్తే దినేశ్ కార్తీక్ కీపింగ్ చాలా సహజంగా కనిపిస్తుందని వెల్లడించాడు. అయితే.. వికెట్ల వెనుక నుంచి రెప్పపాటులో బెయిల్స్‌ని పడగొట్టడంలో ధోనీకి తిరుగులేదని కితాబిచ్చాడు..

ధోనీని నేను తొలిసారి భారత్-ఎ జట్టు తరఫున ఆడుతున్న సమయంలో చూశాను. నిజాయతీగా చెప్పాలంటే.. అప్పుడు ధోనీ కంటే వికెట్ కీపింగ్, బ్యాటింగ్‌లో దినేశ్ కార్తీక్ చాలా సహజంగా కనిపించాడు. ఇప్పటికీ అందరూ వికెట్ కీపర్ల తరహాలో ధోనీ తన చేతి వేళ్లని కీపింగ్ సమయంలో ఉంచడు. క్యాచ్‌లు పట్టే విధానంలోనూ అతని స్టయిల్ వేరు. కానీ.. సుదీర్ఘకాలంగా వికెట్ల వెనుక చక్కగా క్యాచ్‌లు అందుకుంటున్నాడు.. అలానే రెప్పపాటులో బెయిల్స్‌ని ఎగరగొడుతున్నాడు. మొత్తంగా ధోనీది ఒక డిఫరెంట్ టెక్నిక్’’ అని తైబు వెల్లడించాడు..

ఇక తైబు అంతర్జాతీయ క్రికెట్ లో జింబాబ్వే జట్టు తరుపున బరిలో దిగాడు ..చిన్న వయస్సులోనే క్రికెట్లోకి అడుగు పెట్టిన తైబు తొలినాళ్లలో మంచి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తక్కువ వయస్సులోనే కెప్టెన్ గా నియమితుడై జింబాబ్వే జట్టును నడిపించాడు..


Tags :
|
|

Advertisement