Advertisement

  • ఆ ఆటగాడు ఉంటే మ్యాచ్ పరిస్థితి వేరేలా ఉండేది ..ధోని

ఆ ఆటగాడు ఉంటే మ్యాచ్ పరిస్థితి వేరేలా ఉండేది ..ధోని

By: Sankar Sat, 26 Sept 2020 10:03 AM

ఆ ఆటగాడు ఉంటే మ్యాచ్ పరిస్థితి వేరేలా ఉండేది ..ధోని


ఐపీయల్ లో పటిష్ట జట్లలో ముందు వరుసలో ఉండే జట్టు చెన్నై సూపర్ కింగ్స్..ప్రతి ఏడాది ఐపీయల్ లో ప్లే ఆఫ్ కు చేరుకున్న ధోని సేన ఈ ఏడాది మాత్రం వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది..ఇక దిగ్గజ ఆటగాడు ధోని కూడా ఫెయిల్ అవుతుండటం అభిమానులను మరింత నిరాశకు గురి చేస్తుంది..

నిన్న రాత్రి ఐపీఎల్‌ 13లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌, ఢిల్లి క్యాపిటల్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో శ్రేయస్ సేన సూపర్‌ విక్టరీ సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై బాట్స్‌మెన్స్ విఫలమయ్యారు. దీంతో 44 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. సీఎస్‌కే 20 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేయగలిగింది మరోసారి చెన్నై ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యారు.

అయితే..ఈ ఓటమిపై చైన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని స్పందించాడు. అంబటి రాయుడు లేకపోవడంతో చివరి రెండు మ్యాచుల్లో ఓడిపోయామని ధోని చెప్పాడు. బ్యాటింగ్‌ ఆర్డర్ లో సమతూకం రావడం లేదు. ఇది మాకు మంచి మ్యాచ్‌ కాదు. బ్యాటింగ్‌ విభాగంలో కసి తగ్గడం మమ్మల్ని బాధిస్తోంది. తర్వాతి మ్యాచ్‌లో రాయుడు వస్తే జట్టు సమతూకం మెరుగవ్వొచ్చని ధోని తెలిపాడు. కాగా.. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో రాయుడు గాయపడ్డ విషయం తెలిసిందే...

Tags :
|

Advertisement