Advertisement

  • ధరణి పోర్టల్ దేశానికే మార్గదర్శం..సీఎం కెసిఆర్

ధరణి పోర్టల్ దేశానికే మార్గదర్శం..సీఎం కెసిఆర్

By: Sankar Thu, 29 Oct 2020 7:18 PM

ధరణి పోర్టల్ దేశానికే మార్గదర్శం..సీఎం కెసిఆర్


ధరణి పోర్టల్‌ దేశానికే మార్గదర్శకం అన్నారు తెలంగాణ సీఎం కెసిఆర్ .. ఇది పూర్తి పారదర్శకంగా ఉంటుందన్నారు. ఏ దేశంలో ఉన్నా మీ భూమి వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ధరణి పోర్టల్‌ ద్వారా భూములు గోల్‌మాల్‌ అయ్యే అవకాశమే లేదన్నారు.

గతంలో ఢిల్లీ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ భూములను కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకునేవారని, ధరణి పోర్టల్‌ ద్వారా అలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్టు వేశామన్నారు. ఇకపై రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. ఎమ్మార్వో కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు.

డాక్యుమెంట్‌ రైటర్లను కూడా రాబోయే పది రోజుల్లో నియమిస్తామని హామీ ఇచ్చారు. ఎంత ఫీజు వసూలు చేయాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తవుతుందన్నారు. కొత్త పాస్‌ పుస్తకం ఏడు రోజుల్లోనే ఇంటికి వస్తుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

Tags :
|

Advertisement