Advertisement

  • గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత పూర్తిగా ధరణి మీదనే...!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత పూర్తిగా ధరణి మీదనే...!

By: Anji Mon, 30 Nov 2020 8:25 PM

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత పూర్తిగా ధరణి మీదనే...!

అధికార పార్టీ తెరాస GHMCఎన్నికల తర్వాత పూర్తిగా ధరణి మీదనే కేంద్రీకరించనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, హైదరాబాద్ నగరపాలిక ఎన్నికల తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భుముల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పైనే ఆధారపడనున్నట్జ్లు తెలుస్తోంది.

నగరపాలిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కూడా, అధికార యంత్రాంగం మాత్రం ధరణి పోర్టల్ పైనే పూర్తిగా కేంద్రీకృతమైందనే విషయంలో సందేహం అవసరంలేదు. స్వయంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్సే దీనిపై ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తున్నారంటే ప్రభుత్వం ధరణి కి ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్ధమైపోతుంది.

గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు పూర్తిగా తలమునకలైనా సమయంలోకూడా, ప్రస్తుతం సెక్రటేరియట్ గా పిలవబడే బిఆర్క భవన్ లో స్వయంగా ప్రధాన కార్యదర్శి రాత్రి పొద్దు పోయే వరకు ధరణి ఫై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

దీనికి ప్రధాన కారణం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పుల పాలయింది. కోవిడ్ కారణంగా వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. గ్రేటర్ ఎన్నికల వల్ల హైదరాబాద్ నగరంలో ఎన్నికల కోడ్ వుండడంతో ఆదాయం మరింతగా తగ్గిపావడమే కాకుండా, ప్రభుత్వానికి ఖర్చుకూడా పెరిగిపోయింది.

అంతే కాకుండా, గత మూడు నెలల నుండి భూముల రిజిస్ట్రేషన్లు లేకపోవదంతో అటువైపు నుండి వచ్చే ఆదాయం పూర్తిగా లేకుండా పోయింది. వీటన్నికి తోడు, కొన్ని బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ చిన్న చితక కంపెనీలు లేకుండా చూడాలని ప్రభుత్వంపైనా విపరీతమైన వత్తిడి తెస్తున్నాయని కూడా అక్కడక్కడా వినిపిస్తోంది.

దీంతో, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ధరణి ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధార పడడమే కాకుండా, బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు సహకరించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇదంతా గమనిస్తే, రాబోయే రోజుల్లో ప్రభుత్వం పూర్తిగా భూములపైనా వచ్చే ఆదాయంపైన్నే ఆధారపడనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఇక, గ్రేటర్ ఎన్నికల్లో తెరాస గెలిస్తే ల్యాండ్ రేగులేషన్ స్కీమని, బిల్డింగ్ రేగులేషన్ స్కీమాని తెచ్చి 100 గజాల పైన ఇల్లు కట్టుకున్న ప్రతివాని పైనా ఏదో విధంగా పన్నులరూపంలో గుంజాలని ప్రయత్నిస్తోందని అధికారులే స్వయంగా అంగీకరిస్తున్నారు.

అంటే, ఎంత వాత, భూముల పైన వచ్చే ఆదాయం పైన మాత్రమే ఇక నుండి ప్రతువం నడవనుందనేది స్పస్తమవుతుంది.

Tags :
|

Advertisement