Advertisement

  • నూతన రెవిన్యూ చట్టానికి ప్రజలు హర్షం తెలుపుతున్నారు ...పువ్వాడ అజయ్

నూతన రెవిన్యూ చట్టానికి ప్రజలు హర్షం తెలుపుతున్నారు ...పువ్వాడ అజయ్

By: Sankar Tue, 06 Oct 2020 10:05 PM

నూతన రెవిన్యూ చట్టానికి ప్రజలు హర్షం తెలుపుతున్నారు ...పువ్వాడ అజయ్


భూ స‌మ‌స్య‌ల‌కు ధ‌ర‌ణి ప‌రిష్కార‌మార్గంగా ఉండ‌నున్న‌ట్లు రాష్ర్ట ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ తెలిపారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాల క‌లెక్ట‌ర్లు, రెవెన్యూ, మున్సిప‌ల్‌, పంచాయ‌తీ ఉన్న‌తాధికారుల‌తో ఖ‌మ్మం న‌గ‌రంలోని డీపీఆర్‌సీ భ‌వ‌నంలో మంత్రి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... నూతన రెవెన్యూ చట్టం అమలులోకి రావడం వల్ల తెలంగాణ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. నూత‌న రెవెన్యూ చ‌ట్టానికి మద్దతుగా రైతులు పెద్దఎత్తున ర్యాలీలు నిర్వ‌హిస్తున్నార‌న్నారు. దీర్ఘకాలికంగా భూ సంబంధిత సమస్యలు పరిష్కారం కావడం తోపాటు భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావన్నారు. ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇక వ్యవసాయేతర ఆస్తుల లెక్కింపుకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున గణన ప్రక్రియను వేగవంతం చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి మున్సిపల్, పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వ్యవసాయేతర లెక్కింపుపై మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ పంచాయతీ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు

Tags :

Advertisement