Advertisement

డీఎఫ్‌సీసీఐఎల్ చైనా తో ఒప్పందం క్యాన్సల్‌

By: chandrasekar Fri, 19 June 2020 2:17 PM

డీఎఫ్‌సీసీఐఎల్ చైనా తో ఒప్పందం క్యాన్సల్‌


గల్వాన్‌ లోయలో భారత సైనికులపై చైనా దాడికి నిరసనగా భారతీయ రైల్వేకు చెందిన సంస్థ తన ఒప్పందాలను రద్దు చేసుకొన్నది. భారత్‌లో రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థను మరింత వృద్ధి చేసుకోవడంలో భాగంగా ఇండియన్‌ రైల్వేస్‌కు చెందిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (డీఎఫ్‌సీసీఐఎల్‌) బీజింగ్‌ నేషనల్‌ రైల్వే రీసెర్చ్‌ అండ్‌ డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌తో ఒప్పందం చేసుకొన్నది. దాదాపు రూ.471 కోట్ల విలువైన ఈ ఒప్పందం 2016 లో జరిగింది. ఈ ఒప్పందం మేరకు కాన్పూర్‌-డీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ సెక్షన్‌లో 417 కిలోమీటర్ల మేర సిగ్నలింగ్‌ పనులను బీజింగ్‌ సంస్థ చేపట్టాల్సి ఉంటుంది.

గత నాలుగేండ్లుగా కేవలం 20 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, అంతేకాకుండా సరైనా ఇంజినీర్లను, ఫీల్డ్‌ సిబ్బందిని నియమించడంలో విఫలైమయ్యారని డీఎఫ్‌సీసీఐఎల్‌ అధికారులు చెప్తున్నారు. గల్వాన్‌ లోయలో భారతీయ సైనికులపై దాడి చేసి 20 మంది సైనికులను హతమార్చిన చైనాకు తగిన విధంగా బుద్ధి చెప్పేందుకే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకొంటున్నట్లు పేర్కొంటున్నారు.

భారత్‌కు చెందిన వ్యాపారులు కూడా చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఆ దేశానికి చెందిన వస్తువులను కొనుగోలు చేయకుండా నిషేధం విధిస్తూ ఆలిండియా ట్రేడర్స్‌ కాన్ఫెడరేషన్‌ తీర్మాణం చేసింది. చైనా వస్తువులను బహిష్కరించాలంటూ ఈ సమాఖ్య దేశవ్యాప్తంగా ఉద్యమం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది.

Tags :
|

Advertisement