Advertisement

యాదాద్రి లో తగ్గిన భక్తుల సందడి ..

By: Sankar Thu, 13 Aug 2020 3:16 PM

యాదాద్రి లో తగ్గిన భక్తుల సందడి ..



యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ తగ్గుతోంది. రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. దీంతో ఆలయం, పరిసర ప్రాంతాలు వెలవెల బోతున్నాయి.

ప్రజల్లో పెరుగుతున్న కరోనా భయం, శ్రావణ మాసంలో కూడా భక్తుల రద్దీ కానరావడం లేదు. లాక్ డౌన్ ముందు ప్రతిరోజు స్వామివారి దర్శనానికి 10 నుంచి 15 వేల మంది, శని, ఆది,వారాలలో, 20 నుంచి 30 వేయిల మంది భక్తులు దర్శించుకునే వారు. లాక్ డౌన్ సడలింపు తర్వాత ప్రతిరోజు సుమారు 2, నుంచి 3, వేల మంది భక్తులు శని, ఆది,వారాలలో 5 నుంచి 6 వేల మంది మాత్రమే దర్శించుకున్నట్లు తెలుస్తుంది.

స్వామి వారికి వచ్చే నిత్య ఆదాయం, మరియు హుండీ ఆదాయం కూడా భారీగా తగ్గింది. లాక్‌డౌన్‌ ముందు 30 రోజులో హుండీ సుమారు 80 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు వచ్చేది. విశేష రోజుల్లో కోటికి పైగా వచ్చిన సందర్భాలున్నాయి. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలతో లాక్ డౌన్ సడలించి దేవాలయంలోకి భక్తులకు అనుమతిలిచ్చినా 30 రోజుల నుండి ఆదాయం సుమారు 20 లక్షల నుండి 30 లక్షలు మాత్రమే వస్తోంది.

ఈ ఏడు పవిత్ర శ్రావణ మాసంలోనూ భక్తుల సందడి కనిపించడం లేదని, కరోనా కారణంగా భక్తుల సందడి బాగా తగ్గిందని ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహాచార్యులు అంటున్నారు. భక్తుల సందడి లేక బాలాలయం వెలవెలబోతోంది. కాగా కొండపైన కళ్యాణ కట్ట, సత్యనారాయణ స్వామి వ్రతాలు కోవిడ్ కారణంగా అనుమతించకపోవడం ఓ కారణం అయితే.. స్వామి సన్నిధిలో ఆర్జిత సేవలను సైతం ఆన్ లైన్ లో నిర్వహీస్తుండడంతో భక్తులు క్షేత్రం సందర్శనకు అంతగా ఇష్టపడడం లేదు

Tags :
|

Advertisement