Advertisement

  • ఆ మ్యాచ్ ఓటమి వల్లనే రిటైర్మెంట్ ప్రకటించాను ..ఎబి డివిలియర్స్

ఆ మ్యాచ్ ఓటమి వల్లనే రిటైర్మెంట్ ప్రకటించాను ..ఎబి డివిలియర్స్

By: Sankar Thu, 02 July 2020 6:23 PM

ఆ మ్యాచ్ ఓటమి వల్లనే రిటైర్మెంట్ ప్రకటించాను ..ఎబి డివిలియర్స్



ఎబి డివిల్లియర్స్ ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు ..టెస్ట్ , వన్ డే , టి ట్వంటీ ఇలా మూడు ఫార్మటు లలో రాణించిన అతి కొద్దీ మంది ఆటగాళ్లలో ఎబి ఒకడు ..కెరీర్ లో ఎవరైనా వయసు అయిపోయాకనో , లేదా ఫామ్ లోలేకపోవడం వల్లనో రిటైర్మెంట్ తీసుకుంటారు కానీ ఎబి మాత్రం అత్యుత్తమ ఫామ్ లో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు ..అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిఉన్నప్పటికీ వివిధ దేశాలలో జరిగే టి ట్వంటీ టోర్నీలు ఆడటంతో డబ్బు కోసమే ఎబి రిటైర్ అయ్యాడు అని ఆప్పట్లో విమర్శలు వచ్చాయి..

దక్షిణాఫ్రికా జట్టు భవితవ్యం గురించి ఏమాత్రం ఆలోచించకుండా స్వార్థపూరితంగా రిటైర్మెంట్ ప్రకటించాడంటూ కొంత మంది మాజీ క్రికెటర్లు విమర్శించారు. దాంతో.. 2019 వన్డే ప్రపంచకప్ ముంగిట రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాను అని చెప్పినా.. చాలా మంది మాజీ క్రికెటర్లు అతనికి మద్దతు ఇవ్వలేదు. కానీ.. తన రిటైర్మెంట్ వెనుక ఉన్న అసలు కారణాన్ని తాజాగా ఏబీ డివిలియర్స్ వెల్లడించాడు.

క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ 2015 వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా ఓటమిని నన్ను బాధించింది. దాదాపు 12 నెలల పాటు ఆ కుంగుబాటు నుంచి బయటపడటానికి ప్రయత్నించా. ఆ క్రమంలో జట్టుతో కలిసి మళ్లీ మ్యాచ్‌లాడాను.. బ్యాటింగ్‌లో అత్యుత్తమంగా రాణించా. కానీ.. ఆ ఓటమి నన్ను వెంటాడుతూ వచ్చింది. దాంతో.. నేను ఆ వరల్డ్‌కప్ దగ్గరే ఆగిపోయానని అర్థమైంది. ఆ ఓటమి గురించి ఆలోచించిన ప్రతిసారి ఒంటరినైపోయా అనిపించేది.. నా రిటైర్మెంట్‌లో ఆ పరాజయం క్రియాశీలక పాత్ర పోషించింది’’ అని వెల్లడించాడు.

Tags :

Advertisement