Advertisement

  • దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మి పెద్దమొత్తంలో ఆస్తులు కూడబెట్టుకునేందుకు భారీ స్కెచ్

దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మి పెద్దమొత్తంలో ఆస్తులు కూడబెట్టుకునేందుకు భారీ స్కెచ్

By: chandrasekar Wed, 02 Sept 2020 6:48 PM

దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మి పెద్దమొత్తంలో ఆస్తులు కూడబెట్టుకునేందుకు భారీ స్కెచ్


ఐఎంఎస్‌ మందుల కొనుగోలు స్కాంపై ఫోకస్‌ పెట్టిన ఏసీబీ అధికారులు తవ్వినకొద్దీ అవినీతి పుట్ట బద్దలవుతున్నది. ఐఎంఎస్‌ డైరెక్టర్‌గా పనిచేసిన దేవికారాణి, అమెతో అంటకాగిన ఫార్మసిస్ట్‌ నాగలక్ష్మి పెద్దమొత్తంలో ఆస్తులు కూడబెట్టుకునేందుకు భారీ స్కెచ్‌ వేసినట్టు తేలింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతంలో ఆరు ఇండ్ల స్థలాలు, 15వేల చదరపు గజాల కమర్షియల్‌ స్పేస్‌ కొనుగోలుకు ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఏసీబీ అధికారులు కనుగొన్నారు.

వివరాలతో ఆ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు లేఖలు రాయగా, వాస్తవమేనని ఆ సంస్థ సమాధానం పంపింది. దేవికారాణి, నాగలక్ష్మి కలిసి ఆస్తుల కొనుగోలు కోసం రియల్‌ఎస్టేట్‌ సంస్థకు రూ.4.47 కోట్లు చెల్లించారు. ఈ మొత్తాన్ని ఏసీబీ అధికారులు ఆ రియల్‌ఎస్టేట్‌ సంస్థ నుంచి మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదులో రూ.3,75,30,000 దేవికారాణికి చెందినవి కాగా, మిగిలిన రూ.72 లక్షలు నాగలక్ష్మివి అని నిర్ధారించారు. ఈ మొత్తంలో నుంచి దేవికారాణి తన బినామీల పేరిట రూ.22 లక్షలు చెల్లించినట్టు తేలింది.

Tags :

Advertisement