Advertisement

కేసీఆర్‌ సారథ్యంలో అన్ని వర్గాల అభివృద్ధి

By: chandrasekar Wed, 21 Oct 2020 3:50 PM

కేసీఆర్‌ సారథ్యంలో అన్ని వర్గాల అభివృద్ధి


రాష్ట్రంలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు సీఎం కేసీఆర్‌ సారథ్యంలో అందుతున్నాయని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు.

కేసీఆర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలే కాకుండా యాభైకిపైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు సోషల్‌ మీడియాలో అనవసరమైన విమర్శలు చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు లక్షా యాభైవేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, ఐటీ రంగం అభివృద్ధి ద్వారా మరో రెండు లక్షల ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 5.5 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించిందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని, ఐదు కోట్ల ఉద్యోగాలను తొలగించారని ఆరోపించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :
|

Advertisement