Advertisement

  • ఆ యువ ఆటగాడు త్వరలోనే భారత జట్టుకు ఆడతాడు ...బ్రాడ్ హాగ్

ఆ యువ ఆటగాడు త్వరలోనే భారత జట్టుకు ఆడతాడు ...బ్రాడ్ హాగ్

By: Sankar Sun, 11 Oct 2020 4:29 PM

ఆ యువ ఆటగాడు త్వరలోనే భారత జట్టుకు ఆడతాడు ...బ్రాడ్ హాగ్


ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2020 లో సీనియర్లు విఫలమవుతుంటే కురాళ్ళ రెచ్చిపోతున్నారు. అందులో ఒక ప్లేయర్‌ దేవదత్‌ పడిక్కల్‌. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఓపెనర్ గా ఉన్న ఈ యువ ఆటగాడు ఐపీఎల్ లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసి అందరిని దృష్టిని ఆకర్షించాడు.

ఇప్పటివరకు ఆడిన మ్యాచులో మూడు అర్ధ సెంచరీలు బాదిన ఈ ఆటగాడి పై మాజీలు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌.. దేవదత్‌ పడిక్కల్‌పై ప్రశంసలు కురిపించాడు. పడిక్కల్‌ కు ఇది మొదటి ఐపీఎల్‌ అయినా.. మూడు ఆఫ్‌ సెంచరీలు సాధించాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో షెల్డన్ కాట్రెల్‌ వేసిన షాట్‌ బంతికి తడబడ్డా.. ఆ తర్వాత మ్యాచుల్లో క్వాలిటీ ఉన్న బౌలర్లు వేసిన షాట్‌ బంతులను సమర్ధంగా ఎదు​ర్కున్నాడు. రెండు పుల్ షాట్లు ఆడటం నేను చూశాను. బాగా ఆడాడు' అని తెలిపాడు.

ఐపీఎల్‌ 2020లో పార్థీవ్‌ పటేల్‌ స్థానంలో ఓపెనర్‌గా దిగిన దేవదత్‌ పడిక్కల్‌.. అంచనాలను అందుకుంటూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఈ టోర్నీమొత్తం ఇతను ఇలానే ఆడితే భారత జట్టులో కూడా స్థానాన్ని సంపాదించుకుంటాడు అని బ్రాడ్‌ హాగ్ తెలిపాడు.

Tags :
|

Advertisement