Advertisement

  • బ్రెట్ లీ ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో పంచుకున్న వివరాలు

బ్రెట్ లీ ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో పంచుకున్న వివరాలు

By: chandrasekar Mon, 08 June 2020 11:12 AM

బ్రెట్ లీ ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో పంచుకున్న వివరాలు

అంతర్జాతీయ క్రికెట్లో రెండు దశాబ్దల క్రితం ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ బ్రెట్‌లీని అత్యంత వేగవంతమైన బౌలర్లుగా చెప్పుకోవచ్చు. బ్రెట్‌లీ 1999వ సంవత్సరంలో భారత్‌తో మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తన సుదీర్థ క్రికెట్‌ కెరీర్‌లో సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రావిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, బ్రియన్‌ లారా, జాక్వెస్‌ కలీస్‌, కుమార సంగక్కర, ఇంజమామ్‌ హుల్‌ హక్‌, కెవిన్‌ పీటర్సన్‌ లాంటి ఎంతో మంది ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లను ఎదుర్కొన్నాడు.

కరోనా లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన లీ ఓ క్రికెట్‌ వెబ్‌సైట్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన తరంలో ఎవరు ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ అన్న దానిపై అతడు ముగ్గురు క్రికెటర్ల పేర్లు చెప్పాడు. రెండుసార్లు ప్రపంచ కప్(2003, 2007) విజేత గా నిలిచిన బ్రెట్‌లీ సచిన్ టెండూల్కర్(భారత్‌), బ్రియాన్ లారా(వెస్టిండీస్‌), జాక్వెస్ కలిస్(సౌతాఫ్రికా)లను ఉత్తమ బ్యాట్స్‌మెన్లుగా ఎంచుకున్నాడు. టెస్టులు, వన్డేల్లో ఇప్పటికీ టాప్‌ రన్ స్కోరర్‌గా నిలిచిన సచిన్, 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించి, 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

సచినే టెండూల్కర్‌ గురించి చెప్పాలంటే కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. ఎటువంటి పిచ్‌ అయినా అలవోకగా బ్యాటింగ్‌ చేయగలడు. గొప్ప బ్యాట్స్‌మెన్లు చాలా మంది ఉన్నా సచిన్‌ నాకు ప్రత్యేకమై ఆటగాడు. సచిన్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అని లీ పేర్కొన్నాడు.

details,shared,by brett lee,in an online,interview ,బ్రెట్ లీ, ఆన్‌లైన్‌, ఇంటర్వ్యూలో,పంచుకున్న ,వివరాలు


బ్రియాన్ లారా మైదానం నలువైపులా షాట్లు కొట్టగలడని లీ ప్రశంసించాడు. లారా విషయానికొస్తే అతడు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. మీరు ఒకేచోట ఆరు బంతులను బౌల్‌ చేయండి అతను ఆరు వేర్వేరు దిశలవైపు షాట్లు ఆడతాడని బ్రెట్ ‌లీ తెలిపారు. లారా తన క్రికెట్‌ కెరీర్‌లో 299 వన్డేలాడి 10405 పరుగులు చేయగా131 టెస్టుల్లో 11953 రన్స్‌ సాధించాడు.

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాక్వెస్‌ కలీస్‌ను బ్రెట్ లీ అత్యుత్తమ క్రికెటర్‌గా పేర్కొన్నాడు. కలీస్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టగలడని అన్నాడు. సచిన్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని నేను ఎప్పుడూ చెబుతుంటాను. నేను చూసిన, ఆడిన ఆటగాళ్లలో ఐతే బెస్ట్‌ క్రికెటర్‌ కలీసే. అతనొక పరిపూర్ణ క్రికెటర్‌. అవసరమైతే బౌలింగ్‌ను ఆరంభించగలడు, ఒక బ్యాట్స్‌మన్‌గా కూడా రాణించగల మేటి ఆటగాడు. అలాగే, స్లిప్‌లో ఎన్నో క్యాచ్‌లను అందుకున్నాడని లీ వివరించాడు.

Tags :
|

Advertisement