Advertisement

  • ఆగస్టు నెలలో శ్రీవారి విశేష పర్వదినాలు వివరాలు

ఆగస్టు నెలలో శ్రీవారి విశేష పర్వదినాలు వివరాలు

By: chandrasekar Mon, 03 Aug 2020 09:58 AM

ఆగస్టు నెలలో శ్రీవారి విశేష పర్వదినాలు వివరాలు


ఈ సంవత్సరం ఆగస్టు నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలను విడుదల చేసారు. తిరుమల, తిరుపతి దేవస్థానం పరిధిలో ఆగస్టు నెలలో విశేష పర్వదినాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.ఆగస్టు 3న శ్రావణ పౌర్ణమి, శ్రీ హయగ్రీవ జయంతి, శ్రీ విఖనస జయంతి, 12న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం, 13న తిరుమల శ్రీవారి శిక్యోత్సవం, 15న స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు.

భక్తులందరూ ఈ పర్వదినాల వివరాలను గుర్తించి పూజలను జరుపుకుని భగవంతుని ఆసిస్సులు పొందాలని తెలిపారు. అలాగే ఆగస్టు 21న శ్రీ వరాహ జయంతి, 22న వినాయక చవితి, 29న శ్రీ వామన జయంతి, మతత్రయ ఏకాదశిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పర్వ దినాలను కోవిడ్‌ నిబంధనలను అనుసరించి నిర్వహిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులు సాంగీక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు తీసికోవలసిందిగా సూచనలు చేసారు.



Tags :

Advertisement