Advertisement

  • డోనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్

డోనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్

By: chandrasekar Mon, 08 June 2020 8:03 PM

డోనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ అభ్యర్థిత్వం ఖరారైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తైంది. ఈయన అధ్యక్ష పోటీకి కావాల్సిన 1991 మంది ప్రతినిధుల మద్దతును కూడగట్టుకున్నారు.

నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను జో బిడెన్ ఢీ కొట్టనున్నారు. త్వరలోనే ఈయన తన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టునున్నారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో 2009 నుంచి 2017 వరకు బిడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.

జో బిడెన్ అమెరికా మరియు భారత్ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. ఇదిలా ఉండగా, నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై అమెరికాలో నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిడెన్ ఫ్లాయిడ్ కుటుంబాన్ని కలిసి తన సానుభూతిని తెలియజేయనున్నారు.

Tags :

Advertisement