Advertisement

  • హత్రాస్ నిందితులకు న్యాయం కోసం సమావేశం అయిన అగ్రవర్ణాలు

హత్రాస్ నిందితులకు న్యాయం కోసం సమావేశం అయిన అగ్రవర్ణాలు

By: Sankar Sun, 04 Oct 2020 8:09 PM

హత్రాస్ నిందితులకు న్యాయం కోసం సమావేశం అయిన అగ్రవర్ణాలు


ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో 19 ఏండ్ల దళిత యువతిపై సామూహిక లైంగిక దాడి ఘటనపై ఓ వైపు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తగా మరోవైపు ఈ కేసులో అరెస్టైన నలుగురు నిందితులకు న్యాయం కోసం అగ్ర వర్ణాల వారు డిమాండ్ చేస్తున్నాయి.

శుక్రవారం హథ్రాస్ సమీప గ్రామంలో వారు సమావేశం నిర్వహించగా తాజాగా ఆదివారం బాధిత కుటుంబం ఉంటున్న గ్రామంలోనే ఈ ఘటనలో పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్న బీజేపీ నేత రాజ్‌వీర్ సింగ్ పెహెల్వాన్ నివాస ప్రాంగణంలో అగ్రవర్ణాలకు చెందిన సుమారు 500 మంది సమావేశమయ్యారు. నలుగురు నిందితులను తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేశారని వారు విమర్శించారు. నిందితులకు న్యాయం జరుగాలని డిమాండ్ చేశారు.

బాధితురాలిపై లైంగికదాడి జరుగలేదని ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమావేశం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

Tags :

Advertisement