Advertisement

కరోనాతో సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్....

By: chandrasekar Tue, 27 Oct 2020 11:52 AM

కరోనాతో సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్....


ప్రపంచ మహమ్మారి కరోనా మానవ జీవితంలో తీసుకొచ్చిన మార్పులు చాలానే ఉన్నాయి. ఇక ముఖ్యంగా కరోనా వ్యాధి వ్యాప్తి దృష్ట్యా.. ప్రజా రవాణా అంటేనే జనం వణకుతున్నారు. ఎంత ఖర్చైనా సరే.. సొంత వాహనంలోనే ప్రయాణం చేస్తున్నారు. చేతులు కలపడం, నోటి తుంపర్ల ద్వారా, గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉండటంతో ప్రజా రవాణా లో ప్రయాణం చేయాలంటేనే ప్రజలు జంకుతున్నారు. దీంతో ఎంత ఖర్చైనా సరే సొంత వాహనాల్లోనే ప్రయాణాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వాహనాలు భారీగా కొనుగోలు చేస్తున్నారు. అయితే డబ్బున్నవాళ్లే కాదు.. సామాన్య మధ్య తరగతి, వేతన జీవులు కూడా సొంత వాహనాలలో వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఆఫీసుకు వెళ్లేవాళ్లున్నా ఎక్కడికైనా వెళ్లేప్పుడు వారి రక్షణ కోసం కూడా కార్లు కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే వ్యాపారస్థులు ఇన్నాళ్లు షెడ్లలో దాచిన అమ్ముడుపోని పాత కార్లను బయటకు తీస్తున్నారు.

డబ్బులన్న వాళ్లే కాకుండా సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్లు కూడా కార్లను కొనేందుకు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. గడిచిన మూడు, నాలుగు నెలలుగా సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది. కుటుంబ సభ్యులకు కరోనా నుంచి రక్షణ కల్పించడం కోసం ప్రజా రవాణాలో కరోనా భయం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో .. చాలా మంది కార్ల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారని సెండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు చెబుతున్నాయి. కొత్త కార్లను కొనుగోలు చేసే స్థోమత లేని వాళ్లు.. రూ. 70 వేల నుంచి రూ. 3 లక్షల వరకైనా వెచ్చించి సెకండ్ హ్యాండ్ కారును కొంటున్నారు. కొత్తవాటికంటే వీటిని కొనడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే వినియోగదారులు ఈ కార్లను కొనుగోలు చేస్తుండటంతో వీటికి డిమాండ్ అమాంతం పెరిగింది. రూ. 70 వేల నుంచి రూ. 80 వేలకు లభించే కార్లు.. ఏకంగా లక్షా ఇరవై వేల రూపాయల దాకా పలుకుతున్నాయి.

కరోనా తో పాటు పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా సమానంగా ఉండటంతో బైక్ లలో వెళ్లే వాళ్లు కూడా కార్లను కొంటున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పనులకు వెళ్లేవారుంటే.. అందులో ఒక్కోక్కరికి పెట్రోల్ ఖర్చు ఎక్కువవుతుంది. దీంతో ముగ్గురు కలిసి ఒకే వాహనంలో వెళ్తే.. ఆ ఖర్చు కూడా కలిసొస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు. దీనిపై సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే వ్యాపారస్థులు స్పందిస్తూ.. కరోనా నేపథ్యంలో సొంత వాహనాలు కొనేవారి సంఖ్య ఎక్కువైందని అంటున్నారు. గతంలో తాము నెలకు 25 నుంచి 30 వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మితే.. గడిచిన మూడు నెలల నుంచి అది 50కి చేరిందని అమ్మకందారులు అంటున్నారు. అయితే.. మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ఎక్కువగా రూ. 3 లక్షల లోపు వాహనాలను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. కార్ల కోసం వర్క్ షాప్ కు వచ్చే వినియోగదారులు.. వాటి కండిషన్ చూసి అవి మంచి రన్నింగ్ కండిషన్ లో ఉంటే నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలైనా పెట్టడానికి వెనుకాడట్లేదని అమ్మకపుదారులు చెబుతున్నారు.

Tags :
|
|

Advertisement