Advertisement

  • గుడ్లు, చికెన్లకు డిమాండ్...పెరుగ‌నున్న ధ‌ర‌లు

గుడ్లు, చికెన్లకు డిమాండ్...పెరుగ‌నున్న ధ‌ర‌లు

By: chandrasekar Tue, 22 Sept 2020 02:35 AM

గుడ్లు, చికెన్లకు డిమాండ్...పెరుగ‌నున్న ధ‌ర‌లు


పౌష్టికాహారం తీసుకునే వారికి కరోనా సోకే అవ‌కాశాలు త‌క్కువ‌ని, పౌష్టికాహారంవ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని వైద్యులు చెబుతుండ‌ట‌తో దేశంలో డ్రై ఫ్రూట్స్‌, పాలు, కోడిగుడ్లు, చికెన్ వినియోగం బాగా పెరిగింది.

పల్లె ప్రాంతాల్లో గుడ్ల వాడకం ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల నెక్ చేసిన సర్వేలో కూడా తేలింది. మ‌న రాష్ట్రంలో కూడా లాక్‌డౌన్‌ ముందు వరకు రోజుకు 60 నుంచి 70 లక్షల గుడ్ల వినియోగం ఉండేదని, ఇప్పుడా సంఖ్య కోటిని దాటిందని స‌ర్వేలో తేలింది.

దేశంలోనూ గుడ్ల వినియోగం బాగా పెరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు తెలంగాణ‌లోనూ గుడ్లు, చికెన్ డిమాండ్ ఎక్కువైంది. దీంతో వాటి ధ‌ర‌లు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే ఒక్క కోడిగుడ్డు రేటు రూ.6కు, కిలో చికెన్ ధ‌ర రూ.240కి చేరింది. అయితే, మ‌రో వారం రోజుల్లో వీటి ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని నెక్ వ‌ర్గాలు అంటున్నాయి.

Tags :
|

Advertisement