Advertisement

రుచికరమైన కందిపప్పు వేపుడు...

By: chandrasekar Tue, 27 Oct 2020 11:38 AM

రుచికరమైన కందిపప్పు వేపుడు...


పచ్చి కంది పప్పు: ఒక కప్పు

మెంతికూర: ఒక కప్పు,

ఉల్లిపాయ: ఒకటి

టమాటాలు: మూడు

కారం పొడి: రెండు టీ స్పూన్లు

అల్లంవెల్లుల్లి పేస్ట్‌: అర టీస్పూను

పసుపు: పావు టీస్పూను

కొత్తిమీర తురుము: అర కప్పు

కరివేపాకు: రెండు రెమ్మలు

గరం మసాలా: పావు టీస్పూను

ఉప్పు, నూనె: తగినంత

తయారుచేసే విధానం

బాణలిలో నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌, మెంతి కూర, కారంపొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత కంది గింజలు, పసుపు, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి కలపాలి. కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి. సన్నటి మంటమీద పది నిమిషాలు ఉంచి కొత్తిమీర వేసి దించాలి.


Tags :
|

Advertisement