Advertisement

బెంగళూరుపై ఢిల్లీ 59 పరుగుల తేడాతో ఘన విజయం

By: chandrasekar Tue, 06 Oct 2020 09:07 AM

బెంగళూరుపై ఢిల్లీ 59 పరుగుల తేడాతో ఘన విజయం


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్‌-2020లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జోరుకు ఢిల్లీ బ్రేక్‌ వేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై ఢిల్లీ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో స్పీడ్‌స్టర్‌ రబాడ(4/24) ధాటికి బెంగళూరు 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగులకే పరిమితమైంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(43{ 39 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌ ) టాప్‌ స్కోరర్‌. ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌(2/18), నోర్ట్జే(2/22) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనను బెంగళూరు దారుణంగా ఆరంభించింది. పవర్‌ప్లేలోనే దేవదత్‌ పడిక్కల్‌ (4), అరోన్‌ ఫించ్‌ (13), డివిలియర్స్‌ (9) వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోవడంతో ఈ దశలో క్రీజులో ఉన్న కోహ్లీ కాసేపు వేగం కనబరిచాడు. రబాడ వేసిన 14వ ఓవర్లో విరాట్‌ వికెట్‌ కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతోనే బెంగళూరు ఓటమి దాదాపు ఖాయమైంది. ఆ తర్వాత ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో వరుస విరామాల్లో పెవిలియన్‌ బాటపట్టారు. రబాడ పదునైన బంతులకు బెంగళూరు జట్టు కోలుకోలేకపోయింది. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలువలేకపోవడంతో ఆర్‌సీబీ భారీ ఓటమిని చవిచూసింది. అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ స్టాయినీస్‌(53 నాటౌట్‌: 26 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగగా పృథ్వీ షా(42: 23బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు), రిషబ్‌ పంత్‌(37:25 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) , శిఖర్‌ ధావన్‌(32: 28 బంతుల్లో 3ఫోర్లు) రాణించారు. చివర్లో స్టాయినీస్‌ ఎప్పటిలాగే వీరవిహారం చేశాడు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టగా ఉడానా, మొయిన్‌ అలీ చెరో వికెట్‌ తీశారు. బెంగళూరు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మూడవ మ్యాచ్ల్లో పేలవంగా ఓడింది.

Tags :
|
|
|

Advertisement