Advertisement

  • తగ్గింది అనుకున్న ఢిల్లీలో మళ్ళీ విజృంభించిన కరోనా ..రెండు నెలల తర్వాత మళ్ళీ అత్యధిక కేసులు నమోదు

తగ్గింది అనుకున్న ఢిల్లీలో మళ్ళీ విజృంభించిన కరోనా ..రెండు నెలల తర్వాత మళ్ళీ అత్యధిక కేసులు నమోదు

By: Sankar Wed, 02 Sept 2020 10:04 AM

తగ్గింది అనుకున్న ఢిల్లీలో మళ్ళీ విజృంభించిన కరోనా ..రెండు నెలల తర్వాత మళ్ళీ అత్యధిక కేసులు నమోదు


గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్నదేశా రాజధాని ఢిల్లీలో మళ్ళీ కరోనా కలకలం రేపింది.. కరోనా ప్రారంభంలో దేశంలోనే అత్యధిక కేసులు నమోదు అయ్యే రాష్ట్రాలలో ఒకటిగా నిలిచిన ఢిల్లీ ఆ తర్వాత మెల్ల మెల్లగా కరోనా నుంచి బయటపడుతున్నట్లే కనిపించింది..దీనితో ఆ రాష్ట్రంలో మెట్రో సర్వీసులకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..అయితే తాజాగా నమోదు అయినా కేసులు మళ్ళీ ఆందోళనను కలిగిస్తున్నాయి..

గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 2,312 కొత్త కేసులు వెలుగు చూశాయి. గత రెండు నెలల వ్యవధిలో ఈ రోజు అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ప్రస్తుతం ఢిల్లీలో కేసుల సంఖ్య 1.77 లక్షలకు పైగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు వైరస్‌ బారిన పడి 18 మంది మరణించారు. ఇప్పటివరకు ఢిల్లీలో కరోనా బారిన పడి 4,462 మంది మరణించారు. రికవరీ రేటు 88.5శాతంగా ఉంది. ఢిల్లీలో ఇప్పటవరకు అత్యధికంగా జూలై 4న 2, 505 కేసులు నమోదయ్యాయి.

ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 69,921 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 36,91,167 కు చేరింది. వైరస్‌ బాధితుల్లో తాజాగా 819 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 65,288 చేరింది. కరోనా రోగుల్లో కొత్తగా 65,081 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 28,39,883. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,85,996. దేశవ్యాప్తంగా వైరస్‌ బాధితుల రికవరీ రేటు 76.94 శాతంగా ఉందని తెలిపింది. అలాగే మరణాల రేటు 1.77 శాతంగా ఉందని వెల్లడించింది

Tags :
|
|

Advertisement