Advertisement

  • ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ తొలిసారి ఫైనల్స్‌కు

ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ తొలిసారి ఫైనల్స్‌కు

By: chandrasekar Mon, 09 Nov 2020 3:32 PM

ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ తొలిసారి ఫైనల్స్‌కు


ఐపీల్ 2020 లో ఢిల్లీ చరిత్ర సృష్టించింది. ఈ సారు మొట్ట మొదటి సరిగా ఫైనల్స్ కు చేరింది. ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఐపీఎల్ 13వ సీజన్‌లో టైటిల్ బరిలో నిలిచింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఆదివారం జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌ రైజర్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో శ్రేయాస్ అయ్యర్ సేన మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఫైనల్స్‌లో నాలుగుసార్లు టైటిల్ నెగ్గిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. శిఖర్‌ ధవన్‌ (50 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా హెట్‌మైర్‌ (22 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), స్టొయినిస్‌ (38; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) అద్భుతంగా రాణించి స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. అనంతరం లక్ష్యఛేదనలోకి దిగిన హైదరాబాద్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసింది. విలియమ్సన్‌ (45 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా మిగతా ఆటగాళ్లందరూ గెలవాల్సిన మ్యాచ్‌లో రాణించలేకపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రబాడ 4 వికెట్లు తీయగా ఇటు బ్యాటింగ్‌లో రాణించడంతోపాటు బౌలింగ్‌ వేసి 3 వికెట్లు పడగొట్టిన స్టొయినిస్‌‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' వరించింది. ఇతను కీలకమైన వికెట్లు పడగొట్టాడు.

ఢిల్లీ జట్టు గౌరవమైన స్కోర్ ను హైదరాబాద్ ముందు ఉంచడంతో లక్ష్యఛేదనలో హైదరాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. రబాడ వేసిన రెండో ఓవర్‌లో కెప్టెన్‌ వార్నర్‌ (2) ఔట్‌ కాగా స్టొయినిస్‌ వేసిన ఐదో ఓవర్‌లో ప్రియమ్‌ గార్గ్‌ (17; 2 సిక్సర్లు), మనీశ్‌ పాండే (21; 3 ఫోర్లు) ఔట్‌ అయ్యారు. ఈ క్రమంలో క్రిజులోకి వచ్చి ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకున్న విలియమ్సన్‌‌కు హోల్డర్‌ (11) కొంతసేపు సహకరించాడు. హోల్డర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అబ్దుల్‌ సమద్‌ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకారంతో కేన్ స్కోరును కదిలించినప్పటికీ విజయానికి 43 పరుగులు అవసరమైన దశలో విలియమ్సన్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత ఆకట్టుకున్న సమద్, రషీద్‌ ఖాన్‌ కూడా పెవిలియన్‌ బాటపట్టారు. ఆతర్వాత వచ్చిన శ్రీవత్స్‌ గోస్వామి (0) కూడా అవుట్‌ కావడంతో హైదరాబాద్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి ఓటమి పాలైంది. కానీ ప్రస్తుతం ఐపీఎల్‌ చరిత్రలో ఢిల్లీ జట్టు ఫైనల్‌ చేరడం ఇదే ప్రథమం. గతంలో ఆ జట్టు నాలుగుసార్లు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించి ఫైనల్స్‌కు వెళ్లలేకపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో పేలవ ఫీల్డింగ్ కూడా హైదరాబాద్ జట్టుకు భారీ దెబ్బ కొట్టింది. బౌలింగ్‌తో కట్టడి చేయలేకపోయినప్పటికీ హైదరాబాద్ ఆటగాళ్లు అందుకోవాల్సిన క్యాచ్‌లను వదిలేసి భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. ఈ సారి ఐపీల్ 2020 కప్పును ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

Tags :
|
|
|

Advertisement