Advertisement

  • ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో అగ్నిప్రమాదం..స్కూల్ రికార్డులు దగ్ధం

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో అగ్నిప్రమాదం..స్కూల్ రికార్డులు దగ్ధం

By: Sankar Thu, 10 Sept 2020 07:39 AM

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో అగ్నిప్రమాదం..స్కూల్ రికార్డులు దగ్ధం


హైదరాబాద్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదట స్కూల్ అడ్మిన్ బ్లాక్ లో దట్టమైన పొగలతో కూడుకున్న మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో స్కూల్ రికార్డులు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయి. అడ్మిన్ బ్లాక్ లో చెలరేగిన మంటలు చుట్టూ వ్యాపించాయి.

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టూ పక్క్కలవారు ఆందళనకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రెండు ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి చేరుకున్నాయి. కొంతసమయానికి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. షాట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉండగా వైపు కరోనా కలకలం సృష్టిస్తుంటే మరోవైపు అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల హైదరాబాద్ లో ఓ బట్టలషాపు షాట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా కాలిపోయింది. శ్రీశైలం పవర్ ప్లాంట్ ఫైర్ ఘటనలో బారి ఎత్తున ప్రాణ నష్టం జరిగింది..మరోవైపు ఎపిలో కూడా వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి..దీనితో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆందోళనలో ఉన్నారు

Tags :
|

Advertisement