Advertisement

  • టపాసులు పేల్చితే కఠిన చర్యలు తప్పవు ..ఢిల్లీ పోలీస్ శాఖ

టపాసులు పేల్చితే కఠిన చర్యలు తప్పవు ..ఢిల్లీ పోలీస్ శాఖ

By: Sankar Wed, 11 Nov 2020 2:32 PM

టపాసులు పేల్చితే కఠిన చర్యలు తప్పవు ..ఢిల్లీ పోలీస్ శాఖ


దీపావళి టపాసులు పేల్చాలనుకునే వారికి ఢిల్లీ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ వ్యాప్తంగా టపాసులు కాల్చడంపై నిషేధం అమలువుతోందని తెలిపారు. టపాసులు పేల్చేందుకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ విషయంపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్‌ఎన్ శ్రీవాత్సవ బుధవారం మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా టపాసులు పేల్చడం నిషేధించడం ఉందని, టపాసులను పేల్చడమే కాకుండా ఎవరైనా విక్రయించేందుకు ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

టపాసులు విక్రయించుకోవడం కోసం ఇప్పటివరకు జారీ చేసిన లైసెన్సులన్నింటినీ కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు. నవంబరు 30 వరకు ఈ నిషేధం అమలవుతుందని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ తమ పోలీసు బృందాలు గస్తీ తిరుగుతూ ఉంటాయని, ఎక్కడా టపాసుల వినియోగం జరగకుండా అనుక్షణం కాపలా కాస్తూ ఉంటాయని వెల్లడించారు.

Tags :
|

Advertisement